హైదరాబాద్: భారీఎత్తున గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఈ సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సైదాబాద్ ఆలయ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. వాహనంలో భారీ స్థాయిలో గంజాయి తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న నాంపల్లి ఎక్సైజ్ పోలీసులు.. రంగంలోకి దిగి 100 కిలోల గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారీలోఉన్నట్లు సమాచారం.