విజయనగరం జిల్లా డెంకాడ మండలం ఐనాడ జంక్షన్ వద్ద నాలుగున్నర కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
డెంకాడ: విజయనగరం జిల్లా డెంకాడ మండలం ఐనాడ జంక్షన్ వద్ద నాలుగున్నర కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా నుంచి ఒడిశా వైపు వెళుతున్న ఓ కారును సోమవారం రాత్రి పోలీసులు ఆపి తనిఖీ చేయగా గంజాయి అక్రమ రవాణా వెలుగు చూసింది. ఒడిశాకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.