
నిందితుల అరెస్ట్ చూపుతున్న సీఐ అజయ్
కాజీపేట: వృద్ధ దంపతులను హతమార్చిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ అజయ్ తెలిపారు. కాజీపేట పోలీసుస్టేషన్‌లో మంగళవారం రాత్రి విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడారు. సోమిడికి చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి సుంచు ఎల్లయ్య (70) మొదటి భార్య చని పోవడంతో కుటుంబసభ్యుల సమ్మతితో పూలమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ముగ్గురు కుమారులున్నారు. ఎల్లయ్యకు కుమారులకు మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయి. ఎల్లయ్యకు రెండో కుమారుడు శ్రీనివాస్‌తో తరచూ గొడవలు జరిగేవి. దీంతో ఓ రోజు ఎల్లయ్య మిమ్మల్ని సర్వనాశనం చేస్తానని అనడంతో మంత్రాలు చేసి తమను ఇబ్బందులకు గురి చేస్తాడేమోననే భయం శ్రీనివాస్ కుటుంబసభ్యులకు కలిగింది. దీంతో ఎలాగైనా తల్లిదండ్రులను చంపాలని శ్రీని వాస్‌తో పాటు కుమారుడు నిర్ణయించుకున్నారు.
అదునుకోసం చూస్తు న్న శ్రీనివాస్ కుమారుడు ఆశిష్ (19) ఈనెల 1న రాత్రి తాత ఎల్లయ్య ఇంటికి మద్యం తీసుకెళ్లి తాగించాడు. రాత్రి ఆరుబయట ఉన్న బాత్రుం కు వచ్చిన పూలమ్మపై ఆశిష్ వెనుక నుంచి దాడి చేసి కత్తితో గొంతు కోశాడు. పూలమ్మ మెడలో ఉన్న 5తులాల బంగారం గొలుసును జేబు లో వేసుకుని బయట ఉన్న తండ్రి శ్రీనివాస్‌కు ఇచ్చాడు. ఆ తరువాత ఇంట్లో పడుకున్న ఎల్లయ్యపై ఇద్దరు మూకుమ్మడిగా దాడి చేసి కత్తితో విచక్షణారహితంగా పోడవడంతో మృతి చెందాడు. ఆ తర్వాత ఏం తెలి యనట్లుగా బయటకు వచ్చిన తండ్రీ కొడుకులు ఎల్లయ్య కుమారులు రమేష్, తిరుపతిలకు జరిగిన విషయాన్ని చెప్పడంతో విషయం బయటకు రాకుండా నిందితులకు సహకరించారు. హత్య విషయం 2వ తేదీ వెలుగుచూడడంతో పరారిలో ఉన్న ఆశిష్, శ్రీనివాస్‌లను మంగళవారం కాజీపేట రైల్వేజంక్షన్ ప్రాంతంలో తిరుగుతుండగా పట్టుకుని విచారించారు. ఈ మేరకు ఎల్లయ్య పెద్ద కుమారుడు రమేష్, చిన్న కుమారుడు తిరుపతిల పాత్రను బహిర్గతం చేశారు. వెంటనే వారిద్దరిని సోమిడిలో అదుపులోకి తీసుకుని నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment