దేశరాజధాని నగరం ఆడవాళ్లకు సురక్షితం కాదన్న విషయం మరోసారి తేలిపోయింది. ఇద్దరు టీనేజి యువతులపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన నలుగురు యువకులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 17, 18 ఏళ్ల వయసున్న ఇద్దరు యువతులు తమ స్నేహితులతో కలిసి ముకుంద మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక నిర్జన ప్రాంతానికి వెళ్లారు. అక్కడే అబ్బాయిలను కొట్టి.. అమ్మాయిలపై ఒకరి తర్వాత ఒకరు సామూహిక లైంగిక దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితులలో నలుగురిని గుర్తించి గురువారం రాత్రే పోలీసులు అరెస్టు చేశారు. ఐదో వ్యక్తిని కూడా గుర్తించినా, అతడు పరారీలో ఉన్నాడు. నిందితులు కూడా యువతులు ఉండే ప్రాంతంలోనే ఉంటారని, అయితే పరిచయం లేరని అంటున్నారు. పోస్కో చట్టంతో పాటు ఐపీసీ లోని పలు సెక్షన్ల కింద వారిపై అమన్ విహర్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు డీసీపీ విక్రమ్‌జీత్ సింగ్ తెలిపారు. నిందితుల్లో కొందరు మైనర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇద్దరు యువతులపై సామూహికంగా..
Published Fri, Sep 16 2016 9:13 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
Advertisement
Advertisement