కడప అర్బన్: కిడ్నాప్ కేసులో నలుగురు నిందితులను కడప తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు..కడప తాలూకా పరిధిలో నివాసముండే శంకర్ రాజు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మధు అనే వ్యక్తి దగ్గర రూ.5 లక్షలు అప్పు చే శాడు. ఎంతకీ తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవటంతో మధు తన స్నేహితులతో కలిసి రాజు ఇంటికి చేరుకుని మాట్లాడదామని కారులో ఎక్కించుకెళ్లాడు.
ఉదయం వెళ్లిన వ్యక్తి రాత్రయినా ఇంటికి రాకపోవడంతో భయపడిన రాజు భార్య కడప తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రిమ్స్ రోడ్డులోని రైల్వే ట్రాక్ వద్ద కిడ్నాపర్లను పట్టుకున్నారు. వారి నుంచి శంకర్ రాజును విడిపించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.