కళేబరాలతో నూనె తయారీ ముఠా అరెస్ట్ | Four arrested for animal oil manufacturing in nalgonda district | Sakshi
Sakshi News home page

కళేబరాలతో నూనె తయారీ ముఠా అరెస్ట్

Published Fri, Dec 4 2015 11:32 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 PM

నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం మోటకొండూరులో జంతు కళేబరాలతో నూనె తయారు చేస్తున్న ముఠా గుట్టును నల్గొండ జిల్లా పోలీసులు శుక్రవారం రట్టు చేశారు.

నల్గొండ: నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం మోటకొండూరులో జంతు కళేబరాలతో నూనె తయారు చేస్తున్న ముఠా గుట్టును నల్గొండ జిల్లా పోలీసులు శుక్రవారం రట్టు చేశారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్కి తరలిచారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అందులోభాగంగా సదరు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. అయితే జంతు కళేబరాల నుంచి తయారు చేసిన నూనెను పోలీసులు ధ్వంసం చేశారు. జంతు కళేబరాలతో నూనె తయారు చేస్తున్నట్లు స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు దాడి చేసి... నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement