ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా దమ్మపేట - అశ్వారావుపేట మండలాల్లోని పలు గ్రామాల్లో గురువారం ఎక్సైజ్ అధికారులు అకస్మిక దాడులు జరిపారు. ఈ దాడుల్లో సుమారు 90 లీటర్ల కాపు సారాను స్వాధీనం చేసుకున్నారు.అలాగే 3300 లీటర్ల బెల్లం పానకాన్ని కూడా స్వాధీనం చేసుకుని... ధ్వంసం చేశారు.
కాపు సారా తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎక్సైజ్ సీఐ రాంమూర్తి వెల్లడించారు. అశ్వారావుపేట ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాంమూర్తి ఆధ్వర్యంలో అశ్వారావుపేట మండల కేంద్రం, మండలంలోని నారవారిగూడెం గ్రామంలో, దమ్మపేట మండలం ముష్టిదండ, వడ్లగూడెం, మందలపల్లి గ్రామాల్లో దాడులు జరిపారు.