
39 నాటు బాంబులు స్వాధీనం
వెంకటాపురం: వరంగల్ జిల్లా వెంకటాపురం మండల కేంద్రం చివర ఉన్న ఓ మొక్కజొన్న పొలంలో 39 నాటు బాంబులను స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేశారు. మొక్కజొన్న పంటను అటవీ జంతువుల బారి నుంచి కాపాడుకోవటానికి కొంత మంది రైతులు పొలంలో అక్కడక్కడా నాటు బాంబులు పెట్టారు.
ఈ నెల 10న అందులోని ఓ నాటు బాంబు పేలి రాజేశ్వర్ రావు అనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. మొత్తం 40 బాంబులు పాతిపెట్టగా అందులో ఒక బాంబు పేలింది. రాజేశ్వర్ రావు ఫిర్యాదు మేరకు కంచం అశోక్, రెడ్డి దామోదర్, గంటా నరసింగం, మేకల మల్లయ్య అనే రైతులను పోలీసులు అరెస్టు చేశారు.