మెదడువాపు వ్యాక్సిన్ వేస్తామంటూ తిరుగుతున్న నలుగురు సభ్యుల ముఠాను విశాఖపట్టణం పోలీసులు శనివారం మధ్యాహ్నం అరెస్టు చేశారు.
విశాఖపట్నం: మెదడువాపు వ్యాక్సిన్ వేస్తామంటూ తిరుగుతున్న నలుగురు సభ్యుల ముఠాను విశాఖపట్టణం పోలీసులు శనివారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. ప్రభుత్వ వ్యాక్సిన్ కన్నా తక్కువ ధరకే మెదడువాపు వ్యాక్సిన్ వేస్తామంటూ ఆరిలోవాలో హల్చల్ చేసినట్టు పోలీసులు తెలిపారు. రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ జగన్ మోహన్ రావు సహా ముగ్గురు మహిళలను ఆరిలోవ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన ముగ్గురు మహిళలకు వైద్యం గురించి ఏమీ తెలియదని పోలీసులు తెలిపారు.