నలుగురు దొరికారు, ఇద్దరు పరారీ | Four arrested in Bengaluru molestation case, two abscond | Sakshi
Sakshi News home page

నలుగురు దొరికారు, ఇద్దరు పరారీ

Published Fri, Jan 6 2017 9:26 AM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM

Four arrested in Bengaluru molestation case, two abscond

బెంగళూరు:  కమ్మనహళ్లి కాముకుల్లో నలుగురు పోలీసులకు చిక్కారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులకు పట్టుబడ్డ నిందితుల్లో ముగ్గురు 20 ఏళ్లు లోపువారు కావడం గమనార్హం. ఘటన వెలుగులోకి వచ్చిన దాదాపు 48 గంటల్లోపు పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 1 అర్థరాత్రి 1:40 గంటలకు కమ్మనహళ్లి వద్ద నడుచుకుని వెళుతున్న యువతితో స్కూటీపై వచ్చిన ఇద్దరు అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఆరుగురూ కలిసి మూడు బైక్‌లలో ఆమెను వెంబడించారు.

నిందితులు అయ్యప్ప అలియాస్‌ నితీష్‌కుమార్‌ (19) (ఏ1), లెనో అలియాస్‌ లెనిన్‌ ప్యాట్రిక్‌ (20), సుదేష్‌ అలియాస్‌ సుధి (20), సోమశేఖర్‌ అలియాస్‌ చిన్ని (24)లని పోలీసు కమిషనర్‌ ప్రవీణ్‌సూద్‌ మీడియాకు వెల్లడించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితులందరూ స్థానికంగా ఉంటూ చిన్నాచితకా ఉద్యోగాలు చేసేవారు. తన ఇంటి బయటి సీసీ కెమెరాలో నిక్షిప్తమైన చిత్రాలను పరిశీలించి, వాటిని పోలీసులకు అందజేసిన యజమాని ప్రశాంత్‌ ఫ్రాన్సిస్‌ను నగర పోలీస్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ సూద్‌ అభినందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement