శ్రీ వేంకటేశ్వర ఎయిర్‌పోర్ట్‌గా తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ పేరు ! | Lok Sabha 2024: Tirupati Airport To Rename As Sri Venkateswara Airport, More Details Inside | Sakshi
Sakshi News home page

శ్రీ వేంకటేశ్వర ఎయిర్‌పోర్ట్‌గా తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ పేరు !

Published Fri, Jul 26 2024 5:16 AM | Last Updated on Fri, Jul 26 2024 10:23 AM

Lok Sabha 2024: Tirupati Airport to Sri Venkateswara Airport

ప్రతిపాదించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ పేరును శ్రీ వేంకటేశ్వర ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలని ఏపీ సర్కార్‌ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్‌ మొహోల్‌ చెప్పారు. 

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మరో రెండు ఎయిర్‌పోర్ట్‌ల పేర్ల మార్పునూ ప్రతిపాదించింది. 10 రాష్ట్రాలు 22 ఎయిర్‌పోర్టుల పేర్ల మార్పు కోసం ప్రతిపాదనలు పంపాయని మంత్రి వెల్లడించారు. దర్బంగా ఎయిర్‌పోర్ట్‌ను విద్యాపతి ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలని బిహార్‌ కోరింది. ఉత్తరప్రదేశ్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, మహారాష్ట్రలూ ఈ జాబితాలో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement