సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక నగరం తిరుపతి నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తోంది. తిరుపతి విమానాశ్రయానికి 2017లోనే అంతర్జాతీయ విమానాశ్రయ హోదా వచ్చింది. అయితే, ఇప్పటివరకు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కాలేదు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి, తిరుపతి నుంచి ప్రపంచ నగరాలకు విమానాలు నడిచేలా కృషి చేస్తోంది. ముందుగా తిరుపతి విమానాశ్రయం నుంచి కువైట్‌కు సర్వీసులు ప్రారంభించేలా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు విమానయాన సంస్థలతో ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్), స్థానిక ఎంపీ, ఎయిర్‌పోర్టు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక విమాన సర్వీసులు ప్రారంభించడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో ఓపెన్ స్కై పాలసీ కింద కువైట్‌కు విమాన సర్వీసులు ప్రారంభించాలని స్థానిక వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని కోరారు.
ఈ పాలసీ కింద 400 సీట్లు కేటాయించాలని కోరగా కేంద్రం నుంచి సానుకూల స్పందన వచి్చనట్లు అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి కువైట్‌కు సర్వీసులు నడపడానికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయని తిరుపతి ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజ్ కిషోర్ తెలిపారు. ఇండిగో, ఎయిర్‌ఏíÙయా సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. తక్షణం అంతర్జాతీయ సరీ్వసులు నడపడానికి వీలుగా ఎయిర్‌పోర్టులో కస్టమ్స్, ఇమిగ్రేషన్‌కు అవసరమైన సౌకర్యాలతో పాటు విదేశీ ప్రయాణికులు వచ్చి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలు, కన్వేయర్ బెల్ట్ వంటి అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. ఒక్కసారి సరీ్వసులు ప్రారంభిస్తే ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారులను నియమించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
తీరునున్న అవస్తలు
రాయలసీమ ప్రాంత వాసులు విదేశాలకు వెళ్లేందుకు తిరుపతి విమానాశ్రయం చాలా అనుకూలంగా ఉంటుంది. రాయలసీమ నుంచి ముఖ్యంగా చిత్తూరు, రాజంపేట, రాయచోటి, నెల్లూరు ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం వీరంతా వ్యయప్రయాసలకోర్చి చెన్నై వెళ్లి, అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సి వస్తోంది. అదే తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి సరీ్వసులు అందుబాటులోకి వస్తే ఈ అవస్థలు తప్పుతాయని, చాలా సౌకర్యంగా ఉంటుందని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించడానికి ఎంపీ గురుమూర్తి కేంద్రస్థాయిలో సంప్రదింపులు నడుపుతున్నారని, ఇవి సత్ఫలితాలను ఇస్తున్నాయని, త్వరలోనే తిరుపతి నుంచి అంతర్జాతీయ సరీ్వసులు ప్రారంభమవుతాయని ఏపీఏడీసీఎల్ ఎండీ భరత్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment