సాక్షి, తిరుపతి : తిరుపతి విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానానికి ముప్పు తప్పింది. ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా తిరుపతికి వచ్చిన స్పైస్ జెట్ విమానం ల్యాండింగ్ సమయంలో టైర్ పేలినట్లు తెలిసింది. దీంతో అందులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అప్పటికే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి సురక్షితంగా విమానాన్ని టేకాఫ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు విమానానికి మరమ్మత్తులు చేపట్టారు. టైర్లలో గాలి తక్కువగా ఉండడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు. నిన్న సాయంత్రం కూడా ఇదే తరహాలో స్పైస్ జెట్ విమానంలో సాంకేతికత లోపించడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment