
సాక్షి, తాడేపల్లి: ఓటమిని జీర్ణించుకోలేకే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డ్రామాలు చేస్తున్నాడని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని అన్నాడు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చంద్రబాబుకు తెలీదా అని ప్రశ్నించారు. నిరసనకు అనుమతి లేదని నిన్ననే పోలీసులు నోటీసులు ఇచ్చారని, చంద్రబాబుపై టీడీపీ కార్యకర్తలకు విశ్వాసం పోయిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. తమను విశాఖ ఎయిర్‌పోర్టులో ఆపినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందని మండిపడ్డారు. ఈరోజు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందునే చంద్రబాబును ఆపారని తెలిపారు. చంద్రబాబు డ్రామాలు ఇకపై సాగవన్నారు.
చంద్రబాబు ఉదయం నుంచి రేణిగుంటలో ఒక హై డ్రామా నడుపుతున్నారని, బాబు ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించేవారు కాదని ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయారని, చిత్తూరు జిల్లాలో ఎదో అన్యాయం జరిగిందని నిరసన చేస్తానని వెళ్లారని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఎన్నికల కోడ్, కోవిడ్ నిబంధనలు తెలియవా అని ప్రశ్నించారు. వెళ్లాలనుకుంటే ఎన్నికల కమిషన్ వద్ద అనుమతి తీసుకోవాల్సిందని, అనుమతి తీసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదని విమర్శించారు. పోలీసులు దండం పెట్టి చెప్పినా వినకపోవడం ఏమిటమని ధ్వజమెత్తారు.
చదవండి: ఓడింది నువ్వా? ప్రజాస్వామ్యమా? ఇప్పుడు చెప్పు చంద్రబాబూ..
Comments
Please login to add a commentAdd a comment