
విమానాశ్రయంలో జగన్‌కు ఘనస్వాగతం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఉదయం ఇక్కడకు చేరుకున్న ఆయనకు నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక్కడి నుంచి ఆయన నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. నెల్లూరు బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని, అనంతరం రొట్టెల పండుగలో కూడా పాల్గొంటారు.