రన్‌ వేపై విమానాన్ని అడ్డుకున్న కోతులు | Monkeys on runway, SpiceJet plane forced to abort take-off | Sakshi
Sakshi News home page

రన్‌ వేపై విమానాన్ని అడ్డుకున్న కోతులు

Published Sun, Nov 20 2016 8:20 PM | Last Updated on Tue, Oct 2 2018 4:09 PM

రన్‌ వేపై విమానాన్ని అడ్డుకున్న కోతులు - Sakshi

రన్‌ వేపై విమానాన్ని అడ్డుకున్న కోతులు

న్యూఢిల్లీ: రన్‌ వేపైకి జంతువులు రావడం వల్ల విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. తాజాగా ఆదివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ విమానాశ‍్రయంలో కోతులు ఆటంకం కలిగించాయి.

స్పైస్‌ జెట్‌ బోయింగ్‌ 737 విమానం అహ్మదాబాద్‌ నుంచి చెన్నైకు వెళ్లేందుకు సిద్ధమైంది. విమానం టేకాఫ్‌ తీసుకోవడానికి కొన్ని క్షణాల ముందు కోతులు రన్‌ వేపై ప్రత్యక్షమయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అధికారులు  వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేసి విమానాన్ని ఆపేశారు. అదృష్టవశాత్తూ విమానాన్ని సకాలంలో ఆపగలిగామని, ఎవరికీ ప్రమాదం జరగలేదని చెప్పారు. గతంలో జంతువుల వల్ల విమానాలకు అంతరాయం ఏర్పడిన ఘటనలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement