బ్యాంకాక్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న స్పైస్‌జెట్ విమానంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. విమానం ఆకాశంలో ఎగురుతుండగానే, థాయ్ పర్యాటకుడు(53) గుండెపోటుతో కన్నుమూశాడు. ప్రయాణికుడికి తీవ్ర గుండెపోటు రావడంతో, వారణాసిలో ఆ విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. కానీ అప్పటికే ఆ ప్రయాణికుడు కన్నుమూసినట్టు వైద్యాధికారులు చెప్పారు. బ్యాంకాక్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న పర్యాటక గ్రూప్‌లో ఈ వ్యక్తి సభ్యుడు. ఆ ప్రయాణికుడితో పాటు భార్య, సోదరి, ఏడుగురు కుటుంబ సభ్యులు ఆ విమానంలో ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. అందర్ని వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో డిబోర్డు చేశారు. థాయ్‌లాండ్ రాయబారి కార్యాలయానికి ఈ సంఘటన గురించి తెలియజేశారు.
బ్యాంకాక్ నుంచి ఉదయం 7.40 గంటలకు 189 మంది ప్రయాణికులతో ఈ విమానం టేకాఫ్ అయింది. ప్రయాణికుడికి గుండె పోటు వచ్చిందని విమాన సిబ్బంది, ఆ విమానాన్ని లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయనున్నట్టు అధికారులకు తెలిపారు. ల్యాండ్ అయిన వెంటనే, సమీపంలో ఉన్న వైద్య అధికారుల వద్దకు అతన్ని తరలించారు. కానీ ఆయన అప్పటికే కన్నుమూసినట్టు డాక్టర్లు ధృవీకరించారు. ఇటీవలే ఖతార్ ఎయిర్‌వేస్‌లో కూడా ఓ 11నెలల చిన్నారి చనిపోయిన సంగతి తెలిసిందే. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఎదురై, ఆ బాబు మరణించాడు.
Comments
Please login to add a commentAdd a comment