సెమీస్‌లో కర్ణాటక, పంజాబ్ | Karnataka VS Punjab in semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో కర్ణాటక, పంజాబ్

Published Sat, Nov 22 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

Karnataka VS Punjab in semis

విజయ్ హజారే ట్రోఫీ

 వడోదర: దేశవాళీ వన్డే టోర్నీ (విజయ్ హజారే ట్రోఫీ)లో కర్ణాటక, పంజాబ్ జట్లు సెమీ ఫైనల్లోకి ప్రవేశించాయి. శుక్రవారం ఇక్కడ జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక 4 వికెట్ల తేడాతో ముంబైపై గెలిచింది.  ముంబై 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.  కర్ణాటక 49.4 ఓవర్లలో 6 వికెట్లకు 287 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మనీశ్ పాండే (99 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా... స్టువర్ట్ బిన్నీ (58) అండగా నిలిచాడు.

  మరో మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్లతో రైల్వేస్‌పై నెగ్గింది. రైల్వేస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 242 పరుగులు చేయగా... పంజాబ్ 47.2 ఓవర్లలో 5 వికెట్లకు 247 పరుగులు సాధించింది. యువరాజ్ సింగ్ (56), గుర్‌కీరత్ సింగ్ (56 నాటౌట్) రాణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement