మూడో సీడ్ జంటపై గెలిచి సెమీస్‌లోకి
ఆక్లాండ్: ఏఎస్‌బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ– 250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సంచలన విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 3–6, 6–4, 12–10తో మూడో సీడ్ జూలియన్ క్యాష్–లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్) జంటను బోల్తా కొట్టించింది.
81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో 9–10తో యూకీ–ఒలివెట్టి ద్వయం ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే పట్టుదల కోల్పోకుండా ఆడిన యూకీ–ఒలివెట్టి జంట వరుసగా మూడు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది.
మ్యాచ్ మొత్తంలో యూకీ–ఒలివెట్టి నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేశారు. నేడు జరిగే సెమీఫైనల్లో క్రిస్టియన్ హారిసన్–రాజీవ్ రామ్ (అమెరికా)లతో యూకీ–ఒలివెట్టి తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment