ఏఎస్‌బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్ నిశేష్ బసవరెడ్డి సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 19 ఏళ్ల నిశేష్ 6–4, 5–7, 6–4తో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ 23వ ర్యాంకర్ అలెజాంద్రో టబిలో (చిలీ)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు.
2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిశేష్ తొమ్మిది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. గత నెలలో ప్రొఫెషనల్‌గా మారిన నిశేష్ ఈ టోర్నీ తొలి రౌండ్‌లో 6–2, 6–2తో 85వ ర్యాంకర్ కమ్సానా (అర్జెంటీనా)పై గెలిచాడు.
మరోవైపు అడిలైడ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–3, 3–6, 11–13తో నాలుగో సీడ్ హ్యారీ హెలియోవారా (ఫిన్‌లాండ్)–హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment