సెమీస్‌లో చిత్ర | Chitra books semi-final berth in snooker championship | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో చిత్ర

Published Sun, Dec 8 2013 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM

సెమీస్‌లో చిత్ర

సెమీస్‌లో చిత్ర

దౌగాపిల్స్ (లాట్వియా): ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన చిత్ర మగిమైరాజన్ సత్తా చాటుకుంది.  క్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన వర్ష సంజీవ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో చిత్ర 4-0 (59-47, 71-42, 61-26, 61-27) తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే రెండు బిలియర్డ్స్ టైటిళ్లు, ఆస్ట్రేలియా ఓపెన్ గెలుచుకున్న చిత్ర సెమీస్ బెర్తుతో కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.

అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో చిత్ర 4-2 (79-40, 85-16, 33-59, 43-46, 74-56, 61-52)తో సహచరిణి విద్యా పిళ్లైపై... వర్ష 4-1 (68-26, 37-64, 54-19, 68-4, 59-33)తో అరంటా సాంచిస్‌పై విజయం సాధించారు. మరోవైపు పురుషుల విభాగంలో మనన్ చంద్ర, షాబాజ్ ఆదిల్ ఖాన్ తమ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఓడారు. చంద్ర 0-5 (54-75, 0-120, 25-65, 49-74, 20-77)తో ఇంగ్లండ్ ఆటగాడు జెఫ్ కండీ చేతిలో ఘోరంగా ఓడిపోగా... షాబాజ్ 1-5 (46-83, 18-72, 40-67, 31-61, 85-0, 55-68)తో చైనాకు చెందిన జావో గ్జింటోంగ్ చేతిలో ఓడాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement