సెమీస్‌లో బోపన్న జంట | Rohan Bopanna-Aisam-ul-Haq Qureshi in semi-final of Sydney International | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో బోపన్న జంట

Published Thu, Jan 9 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

సెమీస్‌లో బోపన్న జంట

సెమీస్‌లో బోపన్న జంట

సిడ్నీ: అపియా ఇంటర్నేషనల్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్) -ఐజామ్ ఖురేషీ (పాకిస్థాన్) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న-ఖురేషీ 6-7 (3/7), 7-6 (7/5), 10-3తో ట్రాట్ హుయ్ (ఫిలిప్పీన్స్)-డొమినిక్ ఇంగ్లోట్ (బ్రిటన్) జోడిపై విజయం సాధించింది. గంటా 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడిలు ఒక్క బ్రేక్ పాయింట్ కూడా సాధించకపోవడం విశేషం. మరోవైపు ఇదే టోర్నీలో రెండో సీడ్ లియాండర్ పేస్ (భారత్)-రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జోడికి తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. బెనెట్యూ-వాసెలిన్ (ఫ్రాన్స్) జంట 6-4, 6-4తో పేస్-స్టెపానెక్‌లను ఓడించింది. కొత్త సీజన్ పేస్‌కు కలిసిరావడంలేదు. చెన్నై ఓపెన్‌లో అతని భాగస్వామి ఫాబియో ఫాగ్‌నిని గాయం కారణంగా తప్పుకోవడంతో పేస్‌కు ఆడే అవకాశం రాలేదు. ఈ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement