సెమీస్‌లో రుత్విక, సిరిల్ | Ruthvika Shivani Gadde, Siril Verma, Pranaav Chopra-Sikki Reddy enter semifinals of Russia Open | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో రుత్విక, సిరిల్

Published Fri, Oct 7 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

సెమీస్‌లో రుత్విక, సిరిల్

సెమీస్‌లో రుత్విక, సిరిల్

న్యూఢిల్లీ: రష్యా ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన గద్దె రుత్విక శివాని, సిరిల్ వర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రుత్విక శివాని 13-21, 21-10, 21-17తో ఎలీనా కొమెన్‌డ్రోవ్‌స్కా (రష్యా)ను ఓడించగా... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సిరిల్ వర్మ 21-12, 21-18తో జుల్‌హెల్మీ జుల్‌కిఫి (మలేసియా)పై గెలుపొందాడు. మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి సిక్కిరెడ్డి తన భాగస్వామి ప్రణవ్ చోప్రాతో కలిసి సెమీస్‌లోకి ప్రవేశించింది.

క్వార్టర్ ఫైనల్లో సిక్కి-ప్రణవ్ ద్వయం 21-10, 21-8తో వాసిల్‌కిన్-క్రిస్టినా విర్విచ్ (రష్యా) జోడీపై గెలిచింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన తన్వీ లాడ్ 16-21, 19-21తో ఎవగెనియా కొసెట్‌స్కాయ (రష్యా) చేతి లో ఓడిపోయి0ది. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో అనతోలి యార్ట్‌సెవ్-ఎవగెనియా కొసెట్‌స్కాయ (రష్యా) జంటతో సిక్కి రెడ్డి-ప్రణవ్ జోడీ; సెనియా పొలికర్పోవా (రష్యా)తో రుత్విక శివాని; అనతోలి యార్ట్‌సెవ్ (రష్యా)తో సిరిల్ వర్మ తలపడతారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement