Russia Open
-
రష్యా ఓపెన్ చాంప్ సౌరభ్
వ్లాదివోస్టాక్ (రష్యా): భారత షట్లర్ సౌరభ్ వర్మ బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–100 రష్యా ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో 25 ఏళ్ల సౌరభ్ 19–21, 21–12, 21–17తో కొకి వతనబె (జపాన్)పై గెలుపొందాడు. విజేతగా నిలిచిన సౌరభ్‌కు 5,625 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 86 వేలు)తోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ‘ప్రస్తుతం నా ఆటతీరు మెరుగు పర్చుకునేందుకు కష్టపడుతున్నా. ఇందులో పురోగతి సాధించినప్పటికీ ఇంకా కొన్ని అంశాల్లో నిలకడ ప్రదర్శించాల్సివుంది. ఈ ఫైనల్ పోరు క్లిష్టంగా సాగింది. చివరకు గెలిచినందుకు ఆనందంగా ఉంది’ అని రెండేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ టైటిల్ గెలిచిన సౌరభ్ అన్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన సౌరభ్ 2016లో చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రి టైటిల్ గెలిచి, బిట్‌బర్గర్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. మిక్స్డ్ డబుల్స్‌లో రెండో సీడ్ భారత జంట రోహన్ కపూర్– కుహూ గార్గ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. టైటిల్ పోరులో ఈ జోడీ 19–21, 17–21తో ఇవనోవ్ (రష్యా)–మిక్ క్యుంగ్ కిమ్ (కొరియా) ద్వయం చేతిలో పరాజయం చవిచూసింది. -
రష్యా ఓపెన్‌లో సౌరభ్ జయకేతనం
వ్లాదివోస్టాక్ (రష్యా): రష్యా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ వరల్డ్ సూపర్–100 టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను జాతీయ మాజీ చాంపియన్ సౌరభ్ వర్మ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో జపాన్‌కు చెందిన కోకి వటనబేపై సౌరభ్ విజయం సాధించి.. పసిడిని సొంతం చేసుకున్నాడు. తొలి సెట్ 18-21తో కొల్పోయిన సౌరభ్.. ఆ తర్వాత తన అధిక్యాన్ని కనబరుస్తూ.. 21-12, 21-17లతో రెండు సెట్లను కైవసం చేసుకుని జయకేతనం ఎగరవేశాడు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో రోహన్ కపూర్–కుహూ గార్గ్ జోడీ రన్నరప్‌గా నిలిచింది. వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా)–మిన్ యుంగ్ కిమ్ (కొరియా) జోడితో జరిగిన మ్యాచ్‌లో 19-21, 17-21తో వరుస సెట్లు కొల్పోవడంతో ఓటమి చవిచూసింది. -
ఫైనల్లో సౌరభ్ వర్మ
వ్లాదివోస్టాక్ (రష్యా): జాతీయ మాజీ చాంపియన్ సౌరభ్ వర్మ రష్యా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ వరల్డ్ సూపర్–100 టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో అతను 21–9, 21–15తో భారత్‌కే చెందిన మిథున్ మంజునాథ్‌పై విజయం సాధించి తుదిపోరుకు చేరాడు. మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్–కుహూ గార్గ్ జోడీ కూడా ఫైనల్‌కు అర్హత సాధించింది. సెమీఫైనల్లో రెండో సీడ్ రోహన్ కపూర్–కుహూ గార్గ్ జంట 21–19, 11–21, 22–20తో చెన్ టాంగ్ జై–యెన్ వై పెక్ (మలేసియా)జోడీపై పోరాడి గెలిచింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో అరుణ్ జార్జ్–సన్యమ్ శుక్లా జంట 15–21, 19–21తో రెండో సీడ్ కాన్‌స్టన్‌టిన్ అబ్రమోవ్–అలెగ్జెండర్ జిన్చెన్కో (రష్యా) జోడీ చేతిలో ఓడింది. ఫైనల్లో కోకి వటనబే (జపాన్)తో సౌరభ్ వర్మ; వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా)–మిన్ యుంగ్ కిమ్ (కొరియా) ద్వయంతో రోహన్ కపూర్–కుహూ గార్గ్ జోడీ తలపడనుంది. -
సెమీస్‌లో సౌరభ్, మిథున్
వ్లాదివోస్టాక్ (రష్యా): రష్యా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ వరల్డ్ సూపర్–100 టోర్నమెంట్లో భారత షట్లర్లు సౌరభ్ వర్మ , మిథున్ మంజునాథ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ సౌరభ్ వర్మ 21–14, 21–16తో మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్) పై గెలుపొందాడు. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా విజయం సొంతం చేసుకొని సెమీస్ చేరాడు. మరో క్వార్టర్ ఫైనల్లో మిథున్ 21–18, 21–12తో సతీశ్‌థరన్ రామచంద్రన్ (మలేసియా)పై నెగ్గి సెమీస్‌కు అర్హత సాధించాడు. శనివారం జరుగనున్న సెమీఫైనల్లో మిథున్‌తో సౌరభ్ వర్మ తలపడనున్నాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ శుభాంకర్ డే 20–22, 15–21తో రెండో సీడ్ వ్లాదిమిర్ మాల్కోవ్ (రష్యా) చేతిలో ఓడి క్వార్టర్స్‌లోనే నిష్క్రమిం చాడు. మహిళల సింగిల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి గుమ్మడి వృశాలి 9–21, 11–21తో యెన్ మై హో (మలేసియా) చేతిలో; రితూపర్ణ దాస్ 17–21, 13–21తో ఐరిస్ వాంగ్ (అమెరికా) చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. మిక్స్డ్ డబుల్స్‌లో రెండో సీడ్ రోహన్ కపూర్–కుహూ గార్గ్ జోడీ సెమీస్ చేరింది. క్వార్టర్స్‌లో రోహన్–కుహూ ద్వయం 21–13, 21–9తో అండ్రేజ్ లొగినోవ్–లిలియా అబిబులయేవా (రష్యా) జంటపై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. మరో భారత జోడీ సౌరభ్ శర్మ–అనౌష్క పారిఖ్ 15–21, 8–21తో చెన్ టాంగ్ జై–యెన్ వై పీక్ (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి వెనుదిరిగింది. -
క్వార్టర్స్‌లో వృశాలి
వ్లాదివోస్టాక్ (రష్యా): భారత యువ షట్లర్ గుమ్మడి వృశాలి రష్యా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ వరల్డ్ సూపర్–100 టోర్నమెంట్లో సత్తా చాటింది. ప్రిక్వార్టర్స్‌లో ప్రత్యర్థిని వరుస సెట్లలో చిత్తు చేసిన వృశాలి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆమెతో పాటు రితూపర్ణ దాస్, సౌరభ్ వర్మ, మిథున్ మంజునాథ్, శుభాంకర్ డే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో వృశాలి 21–11, 21–13తో బయోల్ లిమ్ లీ (కొరియా)పై అద్భుత విజయం సొంతం చేసుకుంది. 24 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో వృశాలి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. మరో మ్యాచ్‌లో రితూపర్ణ దాస్ 13–21, 21–17, 21–19తో రెండో సీడ్ యింగ్ యింగ్ లీ (మలేసియా)పై పోరాడి గెలిచింది. తొలి గేమ్‌లో ఓడిన రితూపర్ణ వెంటనే పుంజుకొని వరుసగా రెండు గేమ్‌లు నెగ్గి మ్యాచ్ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ సౌరభ్ వర్మ 21–11, 21–9తో సెర్గే సిరాంత్ (రష్యా)పై; మిథున్ 21–16, 21–13తో కోజి నైటో (జపాన్)పై; ఐదో సీడ్ శుభాంకర్ డే 21–11, 21–19తో సిద్ధార్థ్ ప్రతాప్ సింగ్ (భారత్)పై గెలిచి క్వార్టర్స్ చేరారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మరో భారత క్రీడాకారిణి ముగ్ధా ఆగ్రే 4–21, 13–21తో ఐరిస్ వాంగ్ (అమెరికా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సౌరభ్ శర్మ–అనౌష్క పారిఖ్ జోడీ 21–6, 21–12తో ఆర్టెమ్ సెర్పియానోవ్–అనస్తాసియా పుస్తిన్స్కయా (రష్యా) ద్వయంపై; రోహన్ కపూర్–కుహూ గార్గ్ జంట 21–10, 21–14 తో అలెక్సీ పనోవ్–పొలీనా మక్కోవీవా (రష్యా) జోడీపై గెలిచింది. -
సెమీస్‌లో రుత్విక, సిరిల్
న్యూఢిల్లీ: రష్యా ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్‌కు చెందిన గద్దె రుత్విక శివాని, సిరిల్ వర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రుత్విక శివాని 13-21, 21-10, 21-17తో ఎలీనా కొమెన్డ్రోవ్స్కా (రష్యా)ను ఓడించగా... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సిరిల్ వర్మ 21-12, 21-18తో జుల్హెల్మీ జుల్కిఫి (మలేసియా)పై గెలుపొందాడు. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి సిక్కిరెడ్డి తన భాగస్వామి ప్రణవ్ చోప్రాతో కలిసి సెమీస్‌లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో సిక్కి-ప్రణవ్ ద్వయం 21-10, 21-8తో వాసిల్కిన్-క్రిస్టినా విర్విచ్ (రష్యా) జోడీపై గెలిచింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన తన్వీ లాడ్ 16-21, 19-21తో ఎవగెనియా కొసెట్‌స్కాయ (రష్యా) చేతి లో ఓడిపోయి0ది. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో అనతోలి యార్ట్‌సెవ్-ఎవగెనియా కొసెట్‌స్కాయ (రష్యా) జంటతో సిక్కి రెడ్డి-ప్రణవ్ జోడీ; సెనియా పొలికర్పోవా (రష్యా)తో రుత్విక శివాని; అనతోలి యార్ట్‌సెవ్ (రష్యా)తో సిరిల్ వర్మ తలపడతారు. -
క్వార్టర్స్‌లో శివాని, సిరిల్ వర్మ
బాంకాంగ్: రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రిలో వర్ధమాన బ్యాడ్మింటన్ క్రీడాకారులు గద్దె రుత్విక శివాని, తన్వీ లాడ్, సిరిల్ వర్మ క్వార్టర్స్‌కు చేరారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ శివాని 21-9, 21-10 తేడాతో అరుంధతిపై గెలిచింది. తన్వీ 21-10, 21-13తో ఎకటేరినా కుట్ (రష్యా)పై నెగ్గగా... పురుషుల సింగిల్స్‌లో సిరిల్ వర్మ 21-15, 21-9తో మూడో సీడ్ మిషా జిల్బెర్బన్ (ఇజ్రాయెల్)పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్, సిక్కి రెడ్డి జంట కూడా క్వార్టర్స్‌కు చేరింది.