వ్లాదివోస్టాక్ (రష్యా): భారత యువ షట్లర్ గుమ్మడి వృశాలి రష్యా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ వరల్డ్ సూపర్–100 టోర్నమెంట్‌లో సత్తా చాటింది. ప్రిక్వార్టర్స్‌లో ప్రత్యర్థిని వరుస సెట్లలో చిత్తు చేసిన వృశాలి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆమెతో పాటు రితూపర్ణ దాస్, సౌరభ్ వర్మ, మిథున్ మంజునాథ్, శుభాంకర్ డే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో వృశాలి 21–11, 21–13తో బయోల్ లిమ్ లీ (కొరియా)పై అద్భుత విజయం సొంతం చేసుకుంది. 24 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో వృశాలి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. మరో మ్యాచ్‌లో రితూపర్ణ దాస్ 13–21, 21–17, 21–19తో రెండో సీడ్ యింగ్ యింగ్ లీ (మలేసియా)పై పోరాడి గెలిచింది.
తొలి గేమ్‌లో ఓడిన రితూపర్ణ వెంటనే పుంజుకొని వరుసగా రెండు గేమ్‌లు నెగ్గి మ్యాచ్ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ సౌరభ్ వర్మ 21–11, 21–9తో సెర్గే సిరాంత్ (రష్యా)పై; మిథున్ 21–16, 21–13తో కోజి నైటో (జపాన్)పై; ఐదో సీడ్ శుభాంకర్ డే 21–11, 21–19తో సిద్ధార్థ్ ప్రతాప్ సింగ్ (భారత్)పై గెలిచి క్వార్టర్స్ చేరారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మరో భారత క్రీడాకారిణి ముగ్ధా ఆగ్రే 4–21, 13–21తో ఐరిస్ వాంగ్ (అమెరికా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సౌరభ్ శర్మ–అనౌష్క పారిఖ్ జోడీ 21–6, 21–12తో ఆర్టెమ్ సెర్పియానోవ్–అనస్తాసియా పుస్తిన్‌స్కయా (రష్యా) ద్వయంపై; రోహన్ కపూర్–కుహూ గార్గ్ జంట 21–10, 21–14 తో అలెక్సీ పనోవ్–పొలీనా మక్కోవీవా (రష్యా) జోడీపై గెలిచింది.
క్వార్టర్స్‌లో వృశాలి
Published Fri, Jul 27 2018 1:57 AM | Last Updated on Fri, Jul 27 2018 1:57 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment