
సియోల్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. బరిలోకి దిగిన యువ షట్లర్లు అష్మిత చాలిహా, మాళవిక, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్‌లోనే పరాజయం పాలయ్యారు. బుధవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ 53వ ర్యాంకర్ అష్మిత 8–21, 13–21తో 17వ ర్యాంకర్ పోన్‌పావీ చోచువాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది.
మరో మ్యాచ్‌లో ప్రపంచ 41వ ర్యాంకర్ మాళవిక 21–18, 15–21, 17–21తో 18వ ర్యాంకర్ లిన్ హోజ్‌మార్క్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయింది. ఆకర్షి 15–21, 15–21తో లిన్ క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూసింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో ఆయుశ్ రాజ్ గుప్తా–శ్రుతి జంట 7–21, 12–21తో కో సంగ్ హ్యాన్–ఇయోమ్ హ్యూ వోన్ (కొరియా) జోడీ చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment