vrushali
-
సుమీత్ జంటకు డబుల్స్ టైటిల్
ముంబై: స్వదేశంలో జరిగిన టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు మెరిశారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మూడు విభాగాల్లో భారత క్రీడాకారులు టైటిల్స్ సాధించారు. పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ సుమీత్ రెడ్డి తన భాగస్వామి అర్జున్ రామచంద్రన్‌తో కలిసి టైటిల్ దక్కించుకోగా... మహిళల సింగిల్స్‌లో అస్మిత చలిహా, పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ చాంపియన్స్‌గా నిలిచారు. మహిళల సింగిల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి గుమ్మడి వృశాలి... మహిళల డబుల్స్‌లో జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ (భారత్) జోడీ రన్నరప్‌గా నిలిచారు. పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–అర్జున్ ద్వయం 21–10, 21–16తో టాప్ సీడ్ గో జె ఫె–నూర్ ఇజుద్దీన్ (మలేసియా) జంటను చిత్తుగా ఓడించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో వృశాలి 16–21, 13–21తో అష్మిత చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆసియా జూనియర్ చాంపియన్ లక్ష్య సేన్ 21–15, 21–10తో ప్రస్తుత జూనియర్ ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)ను బోల్తా కొట్టించాడు. ఈ గెలుపుతో గత నెలలో కెనడాలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కున్లావుత్ చేతిలో ఎదురైన ఓటమికి లక్ష్య సేన్ బదులు తీర్చుకున్నాడు. మహిళల డబుల్స్ ఫైనల్లో మేఘన–పూర్వీషా రామ్ ద్వయం 10–21, 11–21తో ఎన్జీ వింగ్ యుంగ్–యెంగ్ ఎన్గా టింగ్ (హాంకాంగ్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
టాటా ఓపెన్ టోర్నీ ఫైనల్లో వృశాలి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి గుమ్మడి వృశాలి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో ఎనిమిదో సీడ్ వృశాలి 21–11, 21–12తో ముగ్ధా ఆగ్రే (భారత్)పై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో అష్మిత (భారత్) 21–19, 21–19తో నాలుగో సీడ్ చానన్‌చిడా జుచారోన్ (థాయ్‌లాండ్)పై నెగ్గి వృశాలితో ఆదివారం జరిగే టైటిల్ పోరుకు సిద్ధమైంది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో లక్ష్యసేన్ (భారత్) 17–21, 21–9, 21–12తో కంటావత్ లీలావెచబుర్ (థాయ్‌లాండ్)పై గెలుపొంది ఫైనల్ చేరాడు. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో తెలంగాణ క్రీడాకారిణి జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ జంట 21–18, 9–21, 25–23తో రుతుపర్ణ పాండా–ఆరతి సునీల్ (భారత్) జోడీపై నెగ్గింది. పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ సుమీత్ రెడ్డి–అర్జున్ రామచంద్రన్ ద్వయం 21–16, 20–22, 21–14తో టిన్ ఇస్రియానెత్– తనుపట్ విరియాంగ్‌కురా (థాయ్‌లాండ్) జంటపై నెగ్గి ఫైనల్లో అడుగుపెట్టింది. -
మహిళల సింగిల్స్ విజేత వృశాలి
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుమ్మడి వృశాలి సత్తా చాటింది. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ వృశాలి (ఏపీ) 21–15, 21–18తో మూడోసీడ్ ద్రితి యతీశ్ (కర్ణాటక)పై విజయం సాధించింది. జూనియర్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ ఎం. తరుణ్, ఏపీ క్రీడాకారిణి కె. ప్రీతి విజేతలుగా నిలిచారు. బాలుర సింగిల్స్ టైటిల్ పోరులో ఎం. తరుణ్ (తెలంగాణ) 15–21, 21–14, 21–16తో టాప్ సీడ్ కె. సతీశ్ కుమార్ (తమిళనాడు)కు షాకిచ్చాడు. బాలికల సింగిల్స్ తుదిపోరులో ప్రీతి (ఏపీ) 21–13, 14–21, 21–15తో టాప్‌సీడ్ త్రిషా హెగ్డే (కర్ణాటక)ను ఓడించింది. బాలుర డబుల్స్‌లో తెలంగాణ జోడీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో శ్రీకృష్ణ సాయికుమార్–పి. విష్ణువర్ధన్ గౌడ్ (తెలంగాణ) జంట 21–14, 21–9తో భార్గవ్ గౌడ–శమంత్ రావు (కర్ణాటక) జోడీపై గెలుపొంది విజేతగా నిలిచింది. మరోవైపు పాండిచ్చేరికి ప్రాతినిధ్యం వహించిన తెలుగు అమ్మాయి కవిప్రియ రెండు టైటిళ్లను దక్కించుకుంది. సీనియర్స్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఎస్ కవిప్రియ–సంజయ్ శ్రీవత్స (పాండిచ్చేరి) జోడీ 21–11, 23–21తో లోకేశ్ విశ్వనాథ్–తనుశ్రీ (తమిళనాడు) జంటపై నెగ్గింది. జూనియర్ బాలికల డబుల్స్‌లో ఆగ్నస్ స్వప్న–కవిప్రియ (పాండిచ్చేరి) ద్వయం 21–15, 21–14తో జనని–శ్రుతి (కర్ణాటక) జంటపై గెలిచి విజేతగా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో సతీశ్‌కుమార్–శ్వేత (తమిళనాడు) జంట టైటిల్‌ను సాధించింది. పురుషుల సింగిల్స్‌లో కర్ణాటకకు చెందిన నిఖిల్ శ్యామ్ శ్రీరామ్, డబుల్స్‌లో ప్రకాశ్ రాజ్–వైభవ్ (కర్ణాటక) జోడీ, మహిళల డబుల్స్‌లో హరిత–రిజా ఫర్హాత్ (కేరళ) జంట విజేతలుగా నిలిచాయి. -
సింగిల్స్ రన్నరప్ వృశాలి
సాక్షి, హైదరాబాద్: పోలిష్ ఓపెన్ అంతర్జాతీయ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి గుమ్మడి వృశాలి రన్నరప్‌గా నిలిచింది. పోలాండ్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో వృశాలి 11–21, 14–21తో భారత్‌కే చెందిన రితూపర్ణ దాస్ చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్స్‌లో వృశాలి 23–21, 21–9తో ప్రిస్కిలా(జర్మనీ)పై, రితూపర్ణ 21–19, 21–11తో జోర్డాన్ హార్ట్ (వేల్స్)పై గెలుపొందారు. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్ హర్షీల్ డాని విజేతగా నిలిచాడు. ఫైనల్లో హర్షీల్ 21–19, 21–13తో నాలుగో సీడ్ లూ చియా హంగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. -
వృశాలి సంచలనం
సాక్షి, హైదరాబాద్: పోలిష్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి గుమ్మడి వృశాలి సంచలనం సృష్టించింది. పోలాండ్లోని బీరన్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో వృశాలి 23–21, 21–19తో టాప్ సీడ్ కేట్ ఫ్యూ కున్ (మారిషస్)ను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్లో ఏడో సీడ్ సారా పెనాల్వార్ పెరీరా (స్పెయిన్)పై 20–22, 21–12, 21–11తో నెగ్గిన వృశాలి... ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–11, 21–13తో మోనికా సుజోక్ (హంగేరి)ను ఓడించింది. భారత్‌కే చెందిన రితూపర్ణ దాస్ కూడా సెమీస్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో రితూపర్ణ 21–7, 21–14తో జార్జినా బ్లాండ్ (ఇంగ్లండ్)పై గెలిచింది. -
క్వార్టర్స్‌లో వృశాలి
వ్లాదివోస్టాక్ (రష్యా): భారత యువ షట్లర్ గుమ్మడి వృశాలి రష్యా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ వరల్డ్ సూపర్–100 టోర్నమెంట్లో సత్తా చాటింది. ప్రిక్వార్టర్స్‌లో ప్రత్యర్థిని వరుస సెట్లలో చిత్తు చేసిన వృశాలి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆమెతో పాటు రితూపర్ణ దాస్, సౌరభ్ వర్మ, మిథున్ మంజునాథ్, శుభాంకర్ డే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో వృశాలి 21–11, 21–13తో బయోల్ లిమ్ లీ (కొరియా)పై అద్భుత విజయం సొంతం చేసుకుంది. 24 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో వృశాలి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. మరో మ్యాచ్‌లో రితూపర్ణ దాస్ 13–21, 21–17, 21–19తో రెండో సీడ్ యింగ్ యింగ్ లీ (మలేసియా)పై పోరాడి గెలిచింది. తొలి గేమ్‌లో ఓడిన రితూపర్ణ వెంటనే పుంజుకొని వరుసగా రెండు గేమ్‌లు నెగ్గి మ్యాచ్ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ సౌరభ్ వర్మ 21–11, 21–9తో సెర్గే సిరాంత్ (రష్యా)పై; మిథున్ 21–16, 21–13తో కోజి నైటో (జపాన్)పై; ఐదో సీడ్ శుభాంకర్ డే 21–11, 21–19తో సిద్ధార్థ్ ప్రతాప్ సింగ్ (భారత్)పై గెలిచి క్వార్టర్స్ చేరారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మరో భారత క్రీడాకారిణి ముగ్ధా ఆగ్రే 4–21, 13–21తో ఐరిస్ వాంగ్ (అమెరికా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సౌరభ్ శర్మ–అనౌష్క పారిఖ్ జోడీ 21–6, 21–12తో ఆర్టెమ్ సెర్పియానోవ్–అనస్తాసియా పుస్తిన్స్కయా (రష్యా) ద్వయంపై; రోహన్ కపూర్–కుహూ గార్గ్ జంట 21–10, 21–14 తో అలెక్సీ పనోవ్–పొలీనా మక్కోవీవా (రష్యా) జోడీపై గెలిచింది. -
మహిళలు తిరగబడితే?
మేఘన, ఆరోహి, వృశాలి, పోసాని కృష్ణమురళి ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘త్రినేత్రి’. తిరుపతి కె. వర్మ దర్శకత్వంలో ఎడవెల్లి వెంకట్ రెడ్డి, కాచిడి గోపాల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. తిరుపతి కె. వర్మ మాట్లాడుతూ– ‘‘ఆడవాళ్లపై జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. మహిళలు తిరగబడితే ఎలా ఉంటుంది? అన్నదే కథ. పోసానిగారి పాత్ర ఈ సినిమాకి హైలైట్‌గా ఉంటుంది. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘పోసానిగారు మా సినిమా కథ విని చాలా బాగుంది, కచ్చితంగా మంచి హిట్ అవుతుందన్నారు’’ నిర్మాతలు. ఈ చిత్రానికి సమర్పణ: ఎడవెల్లి రాంరెడ్డి, కెమెరా: చారి, సంగీతం: జయంత్. -
ఫస్ట్ లుక్‌లో కొత్తదనం కనిపిస్తోంది
‘‘మైత్రివనం’ సినిమా ఫస్ట్ లుక్‌లో కొత్తదనం కనిపిస్తోంది. రవిచరణ్ నాకు తెలుసు. సినిమా కోసం బాగా కష్టపడతాడు. సినిమా వినూత్నంగా తెరకెక్కించి ఉంటారనుకుంటున్నా. సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు సుకుమార్. విశ్వ, కిషోర్, వృషాలీ, హర్షదా పాటిల్ ముఖ్య తారలుగా రవిచరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మైత్రివనం’. ‘ఫీనిక్స్ ఎల్ వీ’ అన్నది ఉపశీర్షిక. లక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుఖేష్ ఈశ్వరగారి నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మోషన్ పోస్టర్‌కు ప్రత్యామ్నాయంగా సిద్ధం చేసిన ‘మైత్రివనం’ మూవీ గ్రీటింగ్‌ని, ఫస్ట్ లుక్‌ని సుకుమార్ ఆవిష్కరించారు. రవిచరణ్ మాట్లాడుతూ– ‘‘కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రకథ రాసుకున్నా. ఈ విశ్వంలో మనిషి తలచుకుంటే ఏదైనా చేయగలడు.. ఎంత కష్టమైన లక్ష్యాన్ని అయినా సాధించగలడు. అద్భుతాలు సృష్టించగలడు.. అని చెప్పేందుకు చేసిన ప్రయత్నమే ఈ సినిమా’’ అన్నారు. ‘‘యువతకు నచ్చేలా మంచి సందేశంతో పాటు ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించిన చిత్రమిది. మే నెలలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు సుఖేష్ ఈశ్వరగారి. ఈ చిత్రానికి సంగీతం–ఎడిటర్: కిషోర్ మద్దాలి, కెమెరా: పరంధామ. -
వృశాలి, కిరణ్‌లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో వృశాలి, కిరణ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మంచిర్యాలలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో వృశాలి (రంగారెడ్డి) 21-13, 23-12తో వైష్ణవి (రంగారెడ్డి)పై గెలుపొందింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఎం. కిరణ్ కుమార్ (ఆదిలాబాద్) 6-21, 21-16, 22-20తో సిరిల్ వర్మ (మెదక్) పై విజయం సాధించాడు. మరోవైపు పురుషుల డబుల్స్ ఫైనల్లో రాహుల్ యాదవ్ - గోపిరాజ్ (హైదరాబాద్) జోడి 21-18, 21-9తో గోపాలకృష్ణ (రంగారెడ్డి)-ఆదిత్య (ఖమ్మం) జంటపై నెగ్గి డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. మహిళల డబుల్స్ ఫైనల్లో సాహితి-సృష్టి (మెదక్) జోడి 17-21, 21-9, 21-12తో సుప్రియ-వైష్ణవి (రంగారెడ్డి) జంటపై నె గ్గింది. -
క్వార్టర్స్‌లో వృశాలి, సుప్రియ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో వృశాలి, సుప్రియ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మంచిర్యాలలో జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో వృశాలి (రంగారెడ్డి) 21-3, 21-4తో బ్రాహ్మిణి (నల్లగొండ)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో సుప్రియ (రంగారెడ్డి) 21-18, 21-16తో నితిష (వరంగల్)పై గెలుపొందింది. పరుషుల డబుల్స్‌లో భవదీర్ (హైదరాబాద్)-విఘ్నేష్ రామన్ (రంగారెడ్డి) జోడి 21-15, 21-10తో క్రాంతికుమార్- అరుణ్ (వరంగల్) జంటపై నెగ్గి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ ఫలితాలు సతీశ్ (హైదరాబాద్) 21-9, 21-11తో రాహుల్ (రంగారెడ్డి)పై, అఖిలేశ్వర్ (ఆదిలాబాద్) 21-11, 21-10తో శ్రీనివాస్ (నల్లగొండ)పై, ఆదిత్య (ఖమ్మం)21-6,21-2తో వంశీకృష్ణ (నిజామాబాద్)పై, విజేత (హైదరాబాద్0 21-11, 21-10తో అనిష్ (వరంగల్)పై, క్రాంతికుమార్ (వరంగల్) 21-14, 21-5తో శ్రీకాంత్ (ఖమ్మం)పై, భార్గవ (రంగారెడ్డి) 21-11, 21-16తో సాయి కుమార్( ఆదిలాబాద్)పై, సాయం బోత్రా (హైదరాబాద్) 21-19, 16-21, 21-12తో ఖాజా జలీమ్ (నల్లగొండ)పై, అనురాగ్ (రంగారెడ్డి) 21-6, 21-6తో శివ (నల్గొండ)పై, గోపాలకృష్ణ (రంగారెడ్డి) 21-5, 21-10తో శ్రవణ్ (మహబూబ్‌నగర్)పై, భవదీర్ (హైదరాబాద్) 21-5, 21-8తో నాగరాజ్ (ఖమ్మం)పై, సాగర్ (మెదక్ 21-8, 21-5తో కార్తీక్ (నిజామాబాద్)పై, ఆదిత్య (హైదరాబాద్) 21-10, 11-21, 21-10తో అనిల్ (వరంగల్)పై గెలుపొందారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ ఫలితాలు ప్రమద (మెదక్) 21-1, 21-0తో దుర్గా భవాని (ఆదిలాబాద్)పై, వంశిక (రంగారెడ్డి) 9-21, 21-18, 21-14తో ప్రణాలికర్ని (హైదరాబాద్)పై, పూజ (హైదరాబాద్) 21-3, 21-2తో మోహన సాయి ప్రియ (ఆదిలాబాద్)పై, పూర్వి సింగ్ (నిజామాబాద్) 18-21, 21-18, 21-15తో ఆఫ్రిన్ (హైదరాబాద్)పై, వైష్ణవి (రంగారెడ్డి) 21-8, 21-9తో పూజపై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్ ఫలితాలు రాహుల్- గోపి రాజు (హైదరాబాద్) జోడి 21-11, 21-12తో రఫిక్-రవి (ఆదిలాబాద్) జంటపై, రితిన్-అనిష్ (వరంగల్) జోడి 21-17, 21-16తో సాయి కుమార్- విన్సెంట్ (ఆదిలాబాద్) జంటపై, గోపాలకృష్ణ (రంగారెడ్డి)-ఆదిత్య (ఖమ్మం) జోడి 21-12, 21-10తో నాగరాజు-రామకృష్ణ (ఖమ్మం) జంటపై, రాహుల్ - శ్రవ ణ్ (రంగారెడ్డి) జోడి 21-16, 21-10తో అజయ్-జితేందర్ (కరీంనగర్) జంటపై నెగ్గింది. -
అండర్-19 సింగిల్స్ విజేత వృశాలి
- సాత్విక్-కృష్ణప్రసాద్‌లకు డబుల్స్ టైటిల్ జాతీయ జూ. బ్యాడ్మింటన్ టోర్నీ జైపూర్: జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ క్రీడాకారులు వృశాలి మెరిసింది. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన వృశాలి అండర్-19 బాలికల సింగిల్స్‌లో టైటిల్ చేజిక్కించుకుంది. ఫైనల్లో ఆమె 21-15, 18-21, 21-19తో రెండోసీడ్ శ్రేయాన్షి పరదేశి (మధ్యప్రదేశ్)పై గెలుపొందింది. మిక్స్డ్ డబుల్స్, బాలుర డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్) టైటిల్స్ గెలిచాడు. బాలుర అండర్-17 డబుల్స్ తుదిపోరులో సాత్విక్ సాయిరాజ్-కృష్ణప్రసాద్ (ఆంధ్రప్రదేశ్) ద్వయం 21-23, 21-19, 21-12తో ధ్రువ్ కపిల-సాయిపవన్ జంటపై విజ యం సాధించింది. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్-అహిల్యా హర్జాని (మహారాష్ట్ర) జంట 21-13, 21- 13తో బాలరాజ్ కజియా-మిథుల జోడి (కర్ణాటక)పై నెగ్గింది. హైదరాబాద్ అమ్మాయి తనిష్క్ బాలికల అండర్-17 సింగిల్స్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆమె 13-21, 17-21తో వైదేహి చౌదరి (మహారాష్ర్ట) చేతిలో ఓడింది. -
రాహుల్, వృశాలి శుభారంభం
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ సాక్షి, విజయవాడ: తెలంగాణ క్రీడాకారులు సి. రాహుల్ యాదవ్, జి. వృశాలి జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేశారు. ఇక్కడి డీఆర్ఎంసీ ఇండోర్ స్టేడియంలో సోమవారం వ్యక్తిగత విభాగంలో మెయిన్ డ్రా మ్యాచ్‌లను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రాహుల్ 21-12, 21-12తో మనజీత్ సింగ్ (త్రిపుర)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. కిరణ్ కుమార్ (టీఎస్) 21-9, 13-21, 14-21తో ఆశిష్ శర్మ (ఢిల్లీ) చేతిలో పరాజయం చవిచూడగా... వికాస్ హర్ష (ఏపీ) 21-10, 21- 18తో కబీర్ కంజార్కర్ (మహారాష్ట్ర)పై, భార్గవ రెడ్డి (ఏపీ) 21-13, 21-15తో రాజు ఛెత్రి (నాగాలాండ్)పై గెలిచారు. మహిళల సింగిల్స్‌లో వృశాలి 21-14, 21-12తో రుతపర్ణ పండ (ఒరిస్సా)పై, ప్రాషి జోషి (టీఎస్) 21-7, 21-7తో జైసీ బ్రిడ్జెట్టి (పుదుచ్చేరి)పై గెలిచారు. కె.వైష్ణవి (టీఎస్) 17-21, 21-3, 21-11తో ప్రతాన తాప (నాగాలాండ్)పై, పూర్ణిమ (ఏపీ) 21-15, 21-14తో నిషా (చండీగఢ్)పై, సాయి ఉత్తేజిత (ఏపీ) 21-10, 21-16తో సీమ (హరియాణా)పై విజయం సాధించారు. ఎయిరిండియాకు ఆడుతున్న తెలుగమ్మాయి హారిక 21-4, 21-8తో జూహి దేవాంగన్ (చండీగఢ్)పై గెలిచింది.