వృశాలి, కిరణ్‌లకు టైటిల్స్ | vrushali and kiran got badminton titles | Sakshi
Sakshi News home page

వృశాలి, కిరణ్‌లకు టైటిల్స్

Published Mon, Aug 15 2016 11:28 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

vrushali and kiran got badminton titles

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో వృశాలి, కిరణ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మంచిర్యాలలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో వృశాలి (రంగారెడ్డి) 21-13, 23-12తో వైష్ణవి (రంగారెడ్డి)పై గెలుపొందింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఎం. కిరణ్ కుమార్ (ఆదిలాబాద్) 6-21, 21-16, 22-20తో సిరిల్ వర్మ (మెదక్) పై విజయం సాధించాడు.

 

మరోవైపు పురుషుల డబుల్స్ ఫైనల్లో రాహుల్ యాదవ్ - గోపిరాజ్ (హైదరాబాద్) జోడి 21-18, 21-9తో గోపాలకృష్ణ (రంగారెడ్డి)-ఆదిత్య (ఖమ్మం) జంటపై నెగ్గి డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. మహిళల డబుల్స్ ఫైనల్లో సాహితి-సృష్టి (మెదక్) జోడి 17-21, 21-9, 21-12తో సుప్రియ-వైష్ణవి (రంగారెడ్డి) జంటపై నె గ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement