badminton tourny
-
18, 19 తేదీల్లో బ్యాడ్మింటన్ టోర్నీ
సాక్షి, బెంగళూరు : వైట్‌ఫీల్డ్ ఇంటర్ కమ్యూనిటీ బ్యాడ్మింటన్ టోర్నీ ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించనున్నారు. నగరంలోని సీగేహళ్లిలో ఉన్న వైట్‌ఫీల్డ్ స్పోర్ట్ సెంటర్లో ఈ టోర్నీ జరుగుతుంది. 16 విల్లా/అపార్ట్మెంట్ కమ్యూనిటీలు ఇందులో పాలుపంచుకోనున్నాయి. 18 తేదీన పురుషులు, మహిళల విభాగంలో సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ పోటీలు జరుగుతాయి. 19న చిన్నారుల సింగిల్స్ ఓపెన్ పోటీలు ఉంటాయి. -
భార్గవికి రెండు పతకాలు
జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి కె. భార్గవి సత్తా చాటింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో భార్గవి సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో రెండు పతకాలను సాధించింది. గురువారం జరిగిన అండర్–14 బాలికల సింగిల్స్ ఫైనల్లో గెలుపొందిన భార్గవి స్వర్ణ పతకాన్ని సాధించగా... డబుల్స్ విభాగంలో భార్గవి– శిఖా జోడీ కాంస్యాన్ని దక్కించుకుంది. ఈ విభాగంలో ఏపీకి చెందిన ఎన్. జాహ్నవి– ఆకాంక్ష జంట రజతాన్ని గెలుచుకుంది. మరోవైపు అండర్–17 విభాగంలోనూ రితిన్ రెండు పతకాలతో రాణించాడు. రితిన్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను సాధించాడు. టీమ్ విభాగంలో జరిగిన పోటీల్లో అండర్– 17 బాలుర విభాగంలో ఏపీ, తెలంగాణ జట్లు తృతీయ స్థానాన్ని దక్కించుకున్నాయి. అండర్–14 విభాగంలో ఏపీ బాలుర జట్టు అగ్రస్థానంలో నిలవగా.... తెలంగాణ బాలికల జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది. -
గాయత్రి డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సబ్‌జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పుల్లెల గాయత్రి సత్తాచాటింది. కోయంబత్తూరులో జరిగిన ఈ టోర్నీలో అండర్-15 బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి టైటిల్స్‌ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో గాయత్రి 20- 22, 21- 17, 21-11తో సామియా ఇమాద్ ఫరూఖీ (తెలంగాణ)పై విజయం సాధించింది. డబుల్స్ విభాగంలో గాయత్రి-సామియా ద్వయం 21- 13, 21-16తో త్రిష జోలీ-మెహరీన్ రిజా జంటను ఓడించి విజేతగా నిలిచింది. -
రెండోరౌండ్లో కైవల్య లక్ష్మి, మేఘన
జాతీయ సబ్‌జూనియర్ బ్యాడ్మింటన్ సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్‌జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ అమ్మారుులు కైవల్యలక్ష్మి, మేఘన శుభారంభం చేశారు. విజ యవాడలో జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన అండర్-15 బాలికల తొలి రౌండ్లో కైవల్య లక్ష్మి 21-11, 21-15తో అవంతిక (ఉత్తరప్రదేశ్)పై, మేఘన 21-9, 21-8త రాధికపై, అభిలాష (తెలంగాణ) 21-8, 21-14తో మమైక్యా లంక (ఏపీ)పై గెలిచారు. బాలుర విభాగంలో రెండోరౌండ్ మ్యాచ్‌ల్లో రితిన్ (తెలంగాణ) 21-18, 21-17తో వరుణ్‌పై గెలుపొందాడు. అండర్-13 బాలికల తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో ఆశ్రీత (తెలంగాణ) 21-8, 21-6తో మీనా (రాజస్థాన్)పై, శ్రీనిత్య (తెలంగాణ) 21-12, 23-21తో డోల్మపై విజయం సాధిం చారు. బాలుర తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో సాహస్ (తెలంగాణ) 21-10, 21-15తో జయేశ్ (ఛత్తీస్‌గఢ్)పై, అనిరుధ్ (తెలంగాణ) 21-11, 21-19తో జీత్ పటేల్ (గుజరాత్)పై, ఉనీత్ కృష్ణ 21-15, 21-14తో అస్మిత్ (ఛత్తీస్‌గఢ్)పై నెగ్గారు. -
సాత్విక్‌కు రెండు టైటిల్స్
రన్నరప్ రుత్విక శివాని ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: యోనెక్స్ ఇండియా ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ డబుల్ ధమాకా సాధించాడు. అతను పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచాడు. తెలుగమ్మాయి, టాప్‌సీడ్ రుత్విక శివాని రన్నరప్‌తో తృప్తిపడింది. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్, భారత్‌కే చెందిన రీతుపర్ణ దాస్ 11-7, 8-11, 11-7, 14-12తో గద్దె రుత్విక శివానిని కంగుతినిపించింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ షెట్టి జోడి 8-11, 11-5, 7-11, 11-8, 11-5తో టాప్‌సీడ్ సె ఫె గో-నూర్ ఇజుద్దీన్ (మలేసియా) ద్వయంపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ తుదిపోరులో టాప్‌సీడ్ సాత్విక్-మనీష జంట 5-11, 11-8, 12-10, 11-8తో హాంగ్ యి లొ-యి సి చి (మలేసియా) జోడిపై గెలిచింది. మహిళల డబుల్స్ టైటిల్ పోరులో రుు చింగ్ గో- చివ్ సియెన్ లిమ్ (మలేసియా) జోడి 11-6, 11-7, 6-11, 11-7తో జాయ్స్ చూంగ్- జీ లిన్ లిమ్ (మలేసియా) జంటపై నెగ్గింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్ 11-13, 11-3, 11-6, 11-6తో తొమ్మిదో సీడ్ జి జియా లీ (మలేసియా)ను కంగుతినిపించి టైటిల్ చేజిక్కించుకున్నాడు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సక కార్యక్రమానికి శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎండీ ఎ.దినకర్‌బాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి పతకాలు అందజేశారు. ఇందులో చాముండేశ్వరీనాథ్, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. -
సెమీస్‌లో రుత్విక శివాని, లక్ష్యసేన్
ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: యొనెక్స్ సన్‌రైజ్ ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రుత్విక శివాని, లక్ష్యసేన్ సెమీస్‌కి చేరుకున్నారు. గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో రుత్విక శివాని 11-5, 11-6, 11-8తో రేష్మ కార్తీక్‌పై గెలుపొందగా... పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 10-12, 11-4, 11-8, 6-11, 11-9తో మునావర్‌ను ఓడించాడు. మరోవైపు పురుషుల డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో అర్జున్- రామచంద్రన్ శ్లోక్ ద్వయం 11-6, 12-10, 11-7తో అనిల్‌కుమార్- వెంకట్ గౌరవ్ జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో మహిమా అగర్వాల్- శిఖా గౌతమ్ ద్వయం 10-12, 11-7, 7-11, 11-4,11-9తో కుహూ గార్గ్- హజరికా జోడీపై, మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్‌లో బషీర్ సయ్యద్- సాహితి జోడీ 13-11, 4-11, 12-10, 15-14తో అక్షయ్- రుప్సా ఘోష్ జంటపై గెలుపొందాయి. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు మహిళల సింగిల్స్: శ్రీకృష్ణ ప్రియ 11-6, 8-11, 11-3, 11-5తో కేయూరపై, రీతూపర్ణ దాస్ 9-11, 12-10, 11-5, 11-2తో శిఖా గౌతమ్‌పై, శ్రుతి 12-10, 11-8, 11-7తో స్మిత్ తోష్ని వాల్‌పై విజయం సాధించారు. పురుషుల సింగిల్స్: శ్రేయాన్‌ష జైశ్వాల్ 11-6, 9-11, 11-9, 11-4తో కెయ్ వున్ థీ (మలేసియా)పై, జున్ వెయ్ చెమ్ (మలేసియా) 11-2, 8-11, 11-6, 11-8తో అన్సల్ యాదవ్ (భారత్)పై, జి జియా లీ (మలేసియా) 7-11, 11-6, 11-8, 11-8తో అభిషేక్ పై గెలిచారు. పురుషుల డబుల్స్: సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ జోడీ 11-9, 11-7, 11-8తో నరేంద్రన్- సంజిత్ జంటపై, ఆరోన్- జిన్ హువా థాన్ (మలేసియా) జోడీ 11-7, 11-7, 11-8తో కేతన్ చాహల్- నీరజ్ వశిష్ట్‌పై నెగ్గారు. మిక్స్డ్ డబుల్స్: సాత్విక్ సాయిరాజ్- మనీషా జోడీ 8-11, 12-10, 12-10, 4-11, 11-7తో ధ్రువ్ కపిల- మేఘన జంటపై, విఘ్నేశ్- కుహు గార్గ్ జోడీ 11-7, 11-6, 11-6తో శ్రీకృష్ణ సాయి- సృష్టి జంటపై గెలుపొందారు. -
నార్త్‌జోన్ డబుల్ ధమాక
ఎఫ్‌సీఐ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఎఫ్‌సీఐ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో నార్త్‌జోన్ జట్టు సత్తా చాటింది. రెండు ఈవెంట్లలోనూ విజేతగా నిలిచి టైటిల్స్‌ను దక్కించుకుంది. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల టీమ్ విభాగం ఫైనల్లో నార్త్ జోన్... సౌత్‌జోన్‌పై గెలుపొందగా, టేబుల్ టెన్నిస్ పురుషుల టీమ్ విభాగంలోనూ నార్త్‌జోన్... వెస్ట్‌జోన్‌పై గెలిచి రెండు టైటిల్స్‌ను కైవసం చేసుకుంది. మహిళల బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో వెస్ట్ జోన్... నార్త్‌జోన్‌పై గెలుపొంది విజేతగా నిలిచింది. టేబుల్ టెన్నిస్ మహిళల టీమ్ విభాగంలో సౌత్‌జోన్... వెస్ట్‌జోన్‌పై విజయం సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బహుమతి ప్రదాన కార్యక్రమంలో స్పోర్ట్స ప్రమోషన్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఎస్పీబీ) ఆర్కే చతుర్వేది విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఇతర విభాగాల విజేతల వివరాలు... బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్: 1. సిద్ధార్థ మనోజ్ ఠాకూర్, 2. కౌస్తుభ్ రావత్. మహిళల సింగిల్స్: 1. ఆర్తి సారా సునీల్, 2. సంచాలీ దాస్ గుప్తా. పురుషుల డబుల్స్: 1. మయాంక్-దేవేందర్ జోడీ, 2. సిద్ధార్థ- సృజన్ జోడీ. మహిళల డబుల్స్: 1. ఇషాంతి సావంత్- వల్లనీ బెకాని జోడీ, 2. గీత- గౌరీ జోడీ టేబుల్ టెన్నిస్: పురుషుల సింగిల్స్: 1. అనిరుధ్, 2. శుభమ్ ఓజా. మహిళల సింగిల్స్: 1.సుతీర్థ, 2 చార్వి. -
సెమీస్‌లో సౌత్‌జోన్, ఈస్ట్ జోన్
ఎఫ్‌సీఐ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఎఫ్‌సీఐ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నారుు. ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన టీమ్ చాంపియన్‌షిప్ తొలి క్వార్టర్స్ ఫైనల్లో సౌత్‌జోన్ జట్టు... వెస్ట్ జోన్ జట్టుపై గెలుపొందింది. సింగిల్స్ మ్యాచ్‌లో సిద్ధార్థ్ ఠాకూర్ 21-8, 21-8తో లిఖిత్‌పై గెలుపొందాడు. డబుల్స్ మ్యాచ్‌లో సిద్ధార్థ్- సృజన్ జోడీ 21-15, 21-10తో లిఖిత్- సుశ్రుత్ జంటపై విజయం సాధించింది. రెండో క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టు... నార్త్ ఈస్ట్ జట్టును ఓడించి సెమీస్‌కు చేరుకుంది. మహిళల క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో నార్త్‌జోన్ జట్టు... ఈస్ట్ జోన్‌పై గెలుపొందింది. టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో బుధవారం జరిగిన పురుషుల టీమ్ చాంపియన్‌షిప్‌లో నార్త్ఈస్ట్, వెస్ట్‌జోన్ జట్లు... మహిళల విభాగంలో ఈస్ట్‌జోన్, హెడ్‌క్వార్టర్ జట్లు గెలుపొందాయి. ఈ పోటీలను ఎఫ్‌సీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఒ.పి. డాని ప్రారంభించారు. -
ప్రిక్వార్టర్స్‌లో రుత్విక, ఆర్యమన్
ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ సిరీస్ సాక్షి, హైదరాబాద్: యొనెక్స్ సన్‌రైజ్ ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ సిరీస్‌లో రుత్విక శివాని, ఆర్యమన్ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో బుధవారం ప్రారంభమైన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో గద్దె రుత్విక శివాని (భారత్) 11-8, 11-4, 11-6తో తనిష్క్ (భారత్)పై గెలుపొందగా... పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో ఆర్యమన్ టాండన్ (భారత్) 11-7, 11-4, 11-1తో మనీశ్ గుప్తా (భారత్)ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్- జక్కంపూడి మేఘన (భారత్) జోడీ 11-2, 11-8, 7-11, 11-6తో పంగ్ రోన్ హు- యెన్ వెయ్ పెక్ (మలేసియా) జంటపై, ఉత్తేజిత రావు (భారత్)పై, శ్రీకృష్ణప్రియ 11-9, 11-1, 11-6తో మహేశ్వరి (భారత్)పై గెలుపొందింది. ఇతర ఫలితాలు పురుషుల సింగిల్స్: శ్రేయాన్‌ష జైశ్వాల్ (భారత్) 11-9, 11-5, 11-3తో అరింథాప్ దాస్ గుప్తా (భారత్)పై, జియా వెయ్ తాన్ (మలేసియా) 11-8, 11-6, 11-4తో కార్తీకేయ గుల్షాన్ కుమార్ (భారత్)పై, కెయ్ వున్ (మలేసియా) 11-7, 11-8, 11-9తో అజయ్ (భారత్)పై, కిరణ్ జార్జ్ (భారత్) 11-7, 11-4, 11-1తో మనీశ్ (భారత్)పై గెలుపొందారు. -
రన్నరప్ రాహుల్, శ్రీకృష్ణప్రియ
సింగిల్స్ చాంప్స్ ఫరీద్, రీతూపర్ణ దాస్ అఖిల భారత ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ క్రీడాకారులు శ్రీకృష్ణప్రియ, రాహుల్ యాదవ్ రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. కడపలో జరిగిన ఈ టోర్నీలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రీతుపర్ణ దాస్ (తెలంగాణ) 21-14, 21-16తో కృష్ణప్రియపై విజయం సాధించి టైటిల్‌ను కై వసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో రాహుల్ 10-21, 18-21తో డేనియల్ ఫరీద్ (కర్ణాటక) చేతిలో ఓడిపోరుు రన్నరప్‌గా నిలిచాడు. పురుషుల డబుల్స్ విభాగంలో అర్జున్ (కేరళ)-శ్లోక్ రామచంద్రన్ (ఎరుురిండియా) జోడీ 21-15, 21-12తో అరుణ్ జార్జ్ (కేరళ)-సౌరభ్ శర్మ (హరియాణా) జంటపై గెలిచింది. మహిళల డబుల్స్‌లో అపర్ణ బాలన్ (పీఎస్‌పీబీ)- ఆరతి సారా సునీల్ (కేరళ) జోడీ 21-16, 21-10తో శ్రుతి-హరిత (కేరళ) జంటపై నెగ్గి టైటిల్‌ను దక్కించుకుంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో అర్జున్ (కేరళ)- అపర్ణ బాలన్ (పీఎస్‌పీబీ) జోడీ 21-10, 21-15తో సంజీత్-శ్రుతి (కేరళ) జంటపై నెగ్గి విజేతగా నిలిచింది. -
మేఘన డబుల్ ధమాక
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సబ్‌జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయి మేఘన ఆకట్టుకుంది. కర్నూలులో జరిగిన ఈ టోర్నీలో అండర్-13 బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో మేఘన (తెలంగాణ) 13-21, 21-11, 21-18తో అనుపమా ఉపాధ్యాయ (ఉత్తరప్రదేశ్)పై గెలుపొందింది. డబుల్స్ విభాగంలో మేఘన (తెలంగాణ)- తస్నీమ్ మీర్ (గుజరాత్) ద్వయం 22-20, 21-19తో శ్రేయ (తెలంగాణ)- ప్రవీణ (తమిళనాడు) జోడీని ఓడించి టైటిల్‌ను కై వసం చేసుకుంది. బాలుర సింగిల్స్ విభాగంలో శంకర్ ముత్తుసామి (తమిళనాడు) 19-21, 21-11, 21-10తో ఆకాశ్ సింగ్ (ఉత్తరప్రదేశ్)పై నెగ్గగా... డబుల్స్ విభాగంలో వంశీకృష్ణ (ఏపీ)- ఉనీత్ కృష్ణ (తెలంగాణ) ద్వయం 21-16, 21-13తో సతక్ష్ సింగ్ (ఢిల్లీ)- సారుు సర్వేశ్ (పంజాబ్) జోడీపై గెలుపొందింది. అండర్-15 కేటగిరీలో బాలుర సింగిల్స్ ఫైనల్లో సారుుచరణ్ (ఏపీ) 21-16, 21-13తో ఆయూష్ రాజ్ (ఉత్తరప్రదేశ్)పై, బాలికల సింగిల్స్‌లో రిచా ముక్తిబోధ్ (కర్నాటక) 21-12, 21-12తో మేధ శశిధరణ్ (కర్నాటక)పై గెలుపొందారు. డబుల్స్ విభాగంలో ఎడ్విన్ జాయ్- అరవింద్ సురేశ్ (కేరళ) ద్వయం 21-16, 21-18తో బిద్యాసాగర్- పున్షిబా యెంగ్కోమ్ (మణిపూర్)జోడీపై విజయం సాధించింది. బాలికల డబుల్స్‌లో కేయూర (తెలంగాణ)-కవిప్రియ (పంజాబ్)జంట 21-15, 21-12తో తన్యా హేమంత్- కీర్తన (కర్నాటక) జోడీని ఓడించి విజేతగా నిలిచింది. -
టీసీఎస్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: సింగపూర్‌లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ (టీసీఎస్) ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నీ జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలపడమే లక్ష్యంగా తమ సొసైటీ కృషి చేస్తోందని టీసీఎస్ అధ్యక్షుడు బండ మాధవ రెడ్డి వెల్లడించారు. సింగపూర్‌లోని స్పోర్టిస్ వుడే కోర్టు ల్లో ఈ పోటీలను నిర్వహించారు. మాతృభూమికి దూరంగా వున్న తెలంగాణ వాసులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు టీసీఎస్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ పండగల విశేషాలతో పాటు... క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా ఈ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించామన్నారు. సుమారు వంద మందికి పైగా తెలంగాణ క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నమెంట్ విజేతలకు మాధవ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్, ఉపాధ్యక్షులు బూర్ల శ్రీనివాస్, పెద్ద చంద్రశేఖర్‌రెడ్డి, ముదాం అశోక్ పాల్గొన్నారు. గరేపల్లి శ్రీనివాస్, ఆర్సీ రెడ్డి, లక్ష్మారెడ్డి, దుర్గాప్రసాద్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. -
వృశాలి, కిరణ్‌లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో వృశాలి, కిరణ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మంచిర్యాలలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో వృశాలి (రంగారెడ్డి) 21-13, 23-12తో వైష్ణవి (రంగారెడ్డి)పై గెలుపొందింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఎం. కిరణ్ కుమార్ (ఆదిలాబాద్) 6-21, 21-16, 22-20తో సిరిల్ వర్మ (మెదక్) పై విజయం సాధించాడు. మరోవైపు పురుషుల డబుల్స్ ఫైనల్లో రాహుల్ యాదవ్ - గోపిరాజ్ (హైదరాబాద్) జోడి 21-18, 21-9తో గోపాలకృష్ణ (రంగారెడ్డి)-ఆదిత్య (ఖమ్మం) జంటపై నెగ్గి డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. మహిళల డబుల్స్ ఫైనల్లో సాహితి-సృష్టి (మెదక్) జోడి 17-21, 21-9, 21-12తో సుప్రియ-వైష్ణవి (రంగారెడ్డి) జంటపై నె గ్గింది. -
క్వార్టర్స్‌లో వృశాలి, సుప్రియ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో వృశాలి, సుప్రియ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మంచిర్యాలలో జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో వృశాలి (రంగారెడ్డి) 21-3, 21-4తో బ్రాహ్మిణి (నల్లగొండ)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో సుప్రియ (రంగారెడ్డి) 21-18, 21-16తో నితిష (వరంగల్)పై గెలుపొందింది. పరుషుల డబుల్స్‌లో భవదీర్ (హైదరాబాద్)-విఘ్నేష్ రామన్ (రంగారెడ్డి) జోడి 21-15, 21-10తో క్రాంతికుమార్- అరుణ్ (వరంగల్) జంటపై నెగ్గి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ ఫలితాలు సతీశ్ (హైదరాబాద్) 21-9, 21-11తో రాహుల్ (రంగారెడ్డి)పై, అఖిలేశ్వర్ (ఆదిలాబాద్) 21-11, 21-10తో శ్రీనివాస్ (నల్లగొండ)పై, ఆదిత్య (ఖమ్మం)21-6,21-2తో వంశీకృష్ణ (నిజామాబాద్)పై, విజేత (హైదరాబాద్0 21-11, 21-10తో అనిష్ (వరంగల్)పై, క్రాంతికుమార్ (వరంగల్) 21-14, 21-5తో శ్రీకాంత్ (ఖమ్మం)పై, భార్గవ (రంగారెడ్డి) 21-11, 21-16తో సాయి కుమార్( ఆదిలాబాద్)పై, సాయం బోత్రా (హైదరాబాద్) 21-19, 16-21, 21-12తో ఖాజా జలీమ్ (నల్లగొండ)పై, అనురాగ్ (రంగారెడ్డి) 21-6, 21-6తో శివ (నల్గొండ)పై, గోపాలకృష్ణ (రంగారెడ్డి) 21-5, 21-10తో శ్రవణ్ (మహబూబ్‌నగర్)పై, భవదీర్ (హైదరాబాద్) 21-5, 21-8తో నాగరాజ్ (ఖమ్మం)పై, సాగర్ (మెదక్ 21-8, 21-5తో కార్తీక్ (నిజామాబాద్)పై, ఆదిత్య (హైదరాబాద్) 21-10, 11-21, 21-10తో అనిల్ (వరంగల్)పై గెలుపొందారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ ఫలితాలు ప్రమద (మెదక్) 21-1, 21-0తో దుర్గా భవాని (ఆదిలాబాద్)పై, వంశిక (రంగారెడ్డి) 9-21, 21-18, 21-14తో ప్రణాలికర్ని (హైదరాబాద్)పై, పూజ (హైదరాబాద్) 21-3, 21-2తో మోహన సాయి ప్రియ (ఆదిలాబాద్)పై, పూర్వి సింగ్ (నిజామాబాద్) 18-21, 21-18, 21-15తో ఆఫ్రిన్ (హైదరాబాద్)పై, వైష్ణవి (రంగారెడ్డి) 21-8, 21-9తో పూజపై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్ ఫలితాలు రాహుల్- గోపి రాజు (హైదరాబాద్) జోడి 21-11, 21-12తో రఫిక్-రవి (ఆదిలాబాద్) జంటపై, రితిన్-అనిష్ (వరంగల్) జోడి 21-17, 21-16తో సాయి కుమార్- విన్సెంట్ (ఆదిలాబాద్) జంటపై, గోపాలకృష్ణ (రంగారెడ్డి)-ఆదిత్య (ఖమ్మం) జోడి 21-12, 21-10తో నాగరాజు-రామకృష్ణ (ఖమ్మం) జంటపై, రాహుల్ - శ్రవ ణ్ (రంగారెడ్డి) జోడి 21-16, 21-10తో అజయ్-జితేందర్ (కరీంనగర్) జంటపై నెగ్గింది. -
రుత్వికకు టైటిల్
హైదరాబాద్: వీవీ నాథూ మెమోరియల్ ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి రుత్విక శివాని సత్తా చాటింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రుత్విక 21-18, 21-6తో తులసిపై గెలుపొంది టైటిల్‌ను దక్కించుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో గురుసాయిదత్ 12-21, 21-17, 14-21తో సౌరభ్ వర్మ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. మహిళల డబుల్స్ ఫైనల్లో సిక్కిరెడ్డి- మనీషా జంట 13-21, 21-18, 21-9తో అపమా బాలన్-ప్రజక్త సావంత్ జోడిని ఓడించగా, పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ శెట్టి జంట 21-16, 21-18తో అర్జున్-శ్లోక్ రామచంద్రన్ జోడిపై గెలుపొందింది. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయి-మనీషా జంట 18-21, 26-24, 21-14తో జిష్ణు-ప్రజక్త సావంత్ జోడిని ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. -
సెమీస్‌లో శ్రీకృష్ణప్రియ
హైదరాబాద్: వీవీ నాథూ స్మారక అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయిలు శ్రీకృష్ణప్రియ, రుత్విక శివాని, రితూపర్ణ దాస్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. పుణెలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో శ్రీకృష్ణప్రియ 21-13, 20-22, 21-15తో నాలుగో సీడ్ సాయి ఉత్తేజిత రావు (ఆంధ్రప్రదేశ్)పై సంచలన విజయం సాధించగా... రుత్విక శివాని 21-17, 16-21, 23-21తో రెండో సీడ్ నేహా పండిత్ (మహారాష్ట్ర)పై, రితూపర్ణ 21-18, 21-13తో రేష్మా కార్తీక్ (ఎయిరిండియా)పై గెలిచారు. మహిళల డబుల్స్ విభాగంలో మనీషా-సిక్కి రెడ్డి జంట సెమీస్‌లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో మనీషా-సిక్కి రెడ్డి ద్వయం 16-21, 21-9, 21-15తో శ్రుతి-హరిత (కేరళ) జోడీపై గెలిచింది. -
గాయత్రి ‘డబుల్’ ధమాకా
రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పుల్లెల గాయత్రి సత్తా చాటింది. అండర్- 17 బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. వరంగల్‌లో ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైన ల్లో గాయత్రి (రంగారెడ్డి) 21-9, 21-10తో సామియా (హైదరాబాద్)పై గెలుపొందగా... డబుల్స్‌లో గాయత్రి-సామియా (హైదరాబాద్) జోడి 21-19, 21-14తో సాహితి -సృష్టి జూపూడి (మెదక్) జంటపై నె గ్గి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అండర్-19 బాలికల సింగిల్స్‌లో గాయత్రి రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో వైష్ణవి (రంగారెడ్డి) 21-15, 21-19తో గాయత్రి (రంగారెడ్డి)పై గెలిచింది. డబుల్స్‌లో సాహితి-సృష్టి జూపూడి (మెదక్) జోడి 22-20, 21-12తో ఇషిత-రూహి (హైదరాబాద్) జంటపై విజయం సాధించింది. విజేత విష్ణువర్ధన్: అండర్-17 బాలుర సింగిల్స్‌లో విష్ణువర్ధన్ గౌడ్ (హైదరాబాద్) 21-19, 21-16తో పవన్కృష్ణపై నెగ్గగా... బాలుర డబుల్స్‌లో నవనీత్ (మెదక్)-సాయి కృష్ణ (రంగారెడ్డి) జోడి 21-18,19-21, 21-11తో ఖాదిర్ మొయినుద్దీన్- విష్ణువర్ధన్ (హైదరాబాద్) జంటపై విజయం సాధించారు. అండర్-19 బాలుర సింగిల్స్‌లో ఆదిత్య బాపినీడు (ఖమ్మం) 16-21, 21-11, 21-13తో సాయం బోత్రా (హైదరాబాద్)పై గెలుపొందగా... డబుల్స్ విభాగంలో సిద్ధార్థ్-సాయి కృష్ణ (రంగారెడ్డి) జోడి 21-13, 21-16తో నవనీత్-తరుణ్ (మెదక్) జంటపై నెగ్గింది. -
నేటి నుంచి జాతీయ జూ. బ్యాడ్మింటన్
హైదరాబాద్ : తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నుంచి జాతీయ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరగనుంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యదర్శి అమరేందర్ రెడ్డితో కలిసి టోర్నీ వివరాలను ఆయన వెల్లడించారు. ఈ టోర్నీలో 1486 ఎంట్రీలు వచ్చాయని, అండర్-17, 19 బాలబాలికల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని అన్నారు. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో పోటీలు జరుగుతాయి. నేడు (మంగళవారం) జరిగే టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ‘శాట్స్’ ఎండీ దినకర్ బాబు, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ విచ్చేయనున్నట్లు మల్రెడ్డి రంగారెడ్డి చెప్పారు. ఇండోర్ స్టేడియంలో ఒకేసారి 14 మ్యాచ్‌లు జరిగేలా కోర్టుల్ని సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు. ఇందులో రంగారెడ్డి జిల్లా సంఘం ఉపాధ్యక్షుడు రాంచంద్రరావు, ఎ.ఎన్.సూరి, కె.శ్రీనివాసరావు, యు.వి.ఎన్.బాబు, ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు.