సెమీస్‌లో శ్రీకృష్ణప్రియ | sri krishna priya enters semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో శ్రీకృష్ణప్రియ

Published Sat, Aug 6 2016 11:33 AM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

సెమీస్‌లో శ్రీకృష్ణప్రియ

సెమీస్‌లో శ్రీకృష్ణప్రియ

హైదరాబాద్: వీవీ నాథూ స్మారక అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయిలు శ్రీకృష్ణప్రియ, రుత్విక శివాని, రితూపర్ణ దాస్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. పుణెలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో శ్రీకృష్ణప్రియ 21-13, 20-22, 21-15తో నాలుగో సీడ్ సాయి ఉత్తేజిత రావు (ఆంధ్రప్రదేశ్)పై సంచలన విజయం సాధించగా... రుత్విక శివాని 21-17, 16-21, 23-21తో రెండో సీడ్ నేహా పండిత్ (మహారాష్ట్ర)పై, రితూపర్ణ 21-18, 21-13తో రేష్మా కార్తీక్ (ఎయిరిండియా)పై గెలిచారు.

 

మహిళల డబుల్స్ విభాగంలో మనీషా-సిక్కి రెడ్డి జంట సెమీస్‌లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో మనీషా-సిక్కి రెడ్డి ద్వయం 16-21, 21-9, 21-15తో శ్రుతి-హరిత (కేరళ) జోడీపై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement