Srikrishna Priya
-
సుమీత్ జంటకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: లాగోస్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్‌కు చెందిన సుమీత్ రెడ్డి పురుషుల డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. నైజీరియాలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి ద్వయం 21–12, 21–12తో భారత్‌కే చెందిన వైభవ్–ప్రకాశ్ రాజ్ జంటను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను హైదరాబాద్ అమ్మాయి కె.మనీషా, మనూ అత్రితో కలిసి దక్కించుకుంది. ఫైనల్లో మనీషా–మనూ జంట 21–17, 22–20 తో కుహూ గార్గ్–రోహన్ (భారత్) ద్వయంపై గెలిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి శ్రీకృష్ణప్రియ రన్నరప్‌గా నిలిచింది. మూడో సీడ్ సెనియా పోలికర్పోవా (ఇజ్రాయెల్)తో జరిగిన ఫైనల్లో శ్రీకృష్ణప్రియ 22–20, 16–21, 25–27తో పోరాడి ఓడిపోయింది. -
రన్నరప్ రాహుల్, శ్రీకృష్ణప్రియ
సింగిల్స్ చాంప్స్ ఫరీద్, రీతూపర్ణ దాస్ అఖిల భారత ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ క్రీడాకారులు శ్రీకృష్ణప్రియ, రాహుల్ యాదవ్ రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. కడపలో జరిగిన ఈ టోర్నీలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రీతుపర్ణ దాస్ (తెలంగాణ) 21-14, 21-16తో కృష్ణప్రియపై విజయం సాధించి టైటిల్‌ను కై వసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో రాహుల్ 10-21, 18-21తో డేనియల్ ఫరీద్ (కర్ణాటక) చేతిలో ఓడిపోరుు రన్నరప్‌గా నిలిచాడు. పురుషుల డబుల్స్ విభాగంలో అర్జున్ (కేరళ)-శ్లోక్ రామచంద్రన్ (ఎరుురిండియా) జోడీ 21-15, 21-12తో అరుణ్ జార్జ్ (కేరళ)-సౌరభ్ శర్మ (హరియాణా) జంటపై గెలిచింది. మహిళల డబుల్స్‌లో అపర్ణ బాలన్ (పీఎస్‌పీబీ)- ఆరతి సారా సునీల్ (కేరళ) జోడీ 21-16, 21-10తో శ్రుతి-హరిత (కేరళ) జంటపై నెగ్గి టైటిల్‌ను దక్కించుకుంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో అర్జున్ (కేరళ)- అపర్ణ బాలన్ (పీఎస్‌పీబీ) జోడీ 21-10, 21-15తో సంజీత్-శ్రుతి (కేరళ) జంటపై నెగ్గి విజేతగా నిలిచింది. -
రన్నరప్ శ్రీకృష్ణప్రియ
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి కె. శ్రీకృష్ణప్రియ రన్నరప్‌గా నిలిచింది. కేరళలోని త్రిసూర్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో శ్రీకృష్ణప్రియ 16-21, 8-21తో తన్వీ లాడ్ (పీఎస్‌పీబీ) చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణి జక్కంపూడి మేఘన తన భాగస్వామి సాన్యమ్ శుక్లాతో కలిసి టైటిల్ సాధించింది. ఫైనల్లో మేఘన-శుక్లా ద్వయం 21-7, 21-8తో శివమ్ శర్మ-హారిక జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో కిడాంబి నందగోపాల్-సాన్యమ్ శుక్లా జంట 19-21, 14-21తో రూపేశ్ కుమార్-సనావే థామస్ ద్వయం చేతిలో ఓడిపోయింది. -
సెమీస్‌లో శ్రీకృష్ణప్రియ
హైదరాబాద్: వీవీ నాథూ స్మారక అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయిలు శ్రీకృష్ణప్రియ, రుత్విక శివాని, రితూపర్ణ దాస్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. పుణెలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో శ్రీకృష్ణప్రియ 21-13, 20-22, 21-15తో నాలుగో సీడ్ సాయి ఉత్తేజిత రావు (ఆంధ్రప్రదేశ్)పై సంచలన విజయం సాధించగా... రుత్విక శివాని 21-17, 16-21, 23-21తో రెండో సీడ్ నేహా పండిత్ (మహారాష్ట్ర)పై, రితూపర్ణ 21-18, 21-13తో రేష్మా కార్తీక్ (ఎయిరిండియా)పై గెలిచారు. మహిళల డబుల్స్ విభాగంలో మనీషా-సిక్కి రెడ్డి జంట సెమీస్‌లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో మనీషా-సిక్కి రెడ్డి ద్వయం 16-21, 21-9, 21-15తో శ్రుతి-హరిత (కేరళ) జోడీపై గెలిచింది. -
డచ్ ఓపెన్‌కు శ్రీకృష్ణప్రియ
హైదరాబాద్: జాతీయ స్థాయిలో విశేషంగా రాణిస్తున్న కె.శ్రీకృష్ణప్రియ (తెలంగాణ)... జర్మన్, డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ లకు ఎంపిక చేసిన భారత అండర్-19 జట్టులో చోటు దక్కించుకుంది. ఈ టోర్నీ ఈనెల 25 నుంచి జరగనుంది. పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న శ్రీకృష్ణప్రియ అండర్-19 స్థాయిలో మూడో ర్యాంక్‌లో, మహిళ విభాగంలో 15వ ర్యాంక్‌లో కొనసాగుతోంది.