రన్నరప్ రాహుల్, శ్రీకృష్ణప్రియ | rahul, srikrishna priaya as runner ups in all india badminton tourny | Sakshi
Sakshi News home page

రన్నరప్ రాహుల్, శ్రీకృష్ణప్రియ

Published Mon, Nov 21 2016 10:35 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

rahul, srikrishna priaya as runner ups in all india badminton tourny

సింగిల్స్ చాంప్స్ ఫరీద్, రీతూపర్ణ దాస్

అఖిల భారత ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ

 
 సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ క్రీడాకారులు శ్రీకృష్ణప్రియ, రాహుల్ యాదవ్ రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. కడపలో జరిగిన ఈ టోర్నీలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రీతుపర్ణ దాస్ (తెలంగాణ) 21-14, 21-16తో కృష్ణప్రియపై విజయం సాధించి టైటిల్‌ను కై వసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో రాహుల్ 10-21, 18-21తో డేనియల్ ఫరీద్ (కర్ణాటక) చేతిలో ఓడిపోరుు రన్నరప్‌గా నిలిచాడు.

 

పురుషుల డబుల్స్ విభాగంలో అర్జున్ (కేరళ)-శ్లోక్ రామచంద్రన్ (ఎరుురిండియా) జోడీ 21-15, 21-12తో అరుణ్ జార్జ్ (కేరళ)-సౌరభ్ శర్మ (హరియాణా) జంటపై గెలిచింది. మహిళల డబుల్స్‌లో అపర్ణ బాలన్ (పీఎస్‌పీబీ)- ఆరతి సారా సునీల్ (కేరళ) జోడీ 21-16, 21-10తో శ్రుతి-హరిత (కేరళ) జంటపై నెగ్గి టైటిల్‌ను దక్కించుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో అర్జున్ (కేరళ)- అపర్ణ బాలన్ (పీఎస్‌పీబీ) జోడీ 21-10, 21-15తో సంజీత్-శ్రుతి (కేరళ) జంటపై నెగ్గి విజేతగా నిలిచింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement