రెండోరౌండ్‌లో కైవల్య లక్ష్మి, మేఘన | kaivalya lakshmi, meghana enter second round in jr badminton | Sakshi
Sakshi News home page

రెండోరౌండ్‌లో కైవల్య లక్ష్మి, మేఘన

Published Sat, Dec 3 2016 10:42 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

kaivalya lakshmi, meghana enter second round in jr badminton

జాతీయ సబ్‌జూనియర్ బ్యాడ్మింటన్   

సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్‌జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ అమ్మారుులు కైవల్యలక్ష్మి, మేఘన శుభారంభం చేశారు. విజ యవాడలో జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన అండర్-15 బాలికల తొలి రౌండ్‌లో కైవల్య లక్ష్మి 21-11, 21-15తో అవంతిక (ఉత్తరప్రదేశ్)పై, మేఘన 21-9, 21-8త రాధికపై, అభిలాష (తెలంగాణ) 21-8, 21-14తో మమైక్యా లంక (ఏపీ)పై గెలిచారు. బాలుర విభాగంలో రెండోరౌండ్ మ్యాచ్‌ల్లో రితిన్ (తెలంగాణ) 21-18, 21-17తో వరుణ్‌పై గెలుపొందాడు.

 

అండర్-13 బాలికల తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో ఆశ్రీత (తెలంగాణ) 21-8, 21-6తో మీనా (రాజస్థాన్)పై, శ్రీనిత్య (తెలంగాణ) 21-12, 23-21తో డోల్మపై విజయం సాధిం చారు. బాలుర తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో సాహస్ (తెలంగాణ) 21-10, 21-15తో జయేశ్ (ఛత్తీస్‌గఢ్)పై, అనిరుధ్ (తెలంగాణ) 21-11, 21-19తో జీత్ పటేల్ (గుజరాత్)పై, ఉనీత్ కృష్ణ 21-15, 21-14తో అస్మిత్ (ఛత్తీస్‌గఢ్)పై నెగ్గారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement