మేఘన డబుల్ ధమాక | meghana gets double dhamaka in sub jr badminton tourny | Sakshi
Sakshi News home page

మేఘన డబుల్ ధమాక

Published Mon, Nov 14 2016 10:36 AM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM

meghana gets double dhamaka in sub jr badminton tourny

సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సబ్‌జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగు అమ్మాయి మేఘన ఆకట్టుకుంది. కర్నూలులో జరిగిన ఈ టోర్నీలో అండర్-13 బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో మేఘన (తెలంగాణ) 13-21, 21-11, 21-18తో అనుపమా ఉపాధ్యాయ (ఉత్తరప్రదేశ్)పై గెలుపొందింది. డబుల్స్ విభాగంలో మేఘన (తెలంగాణ)- తస్నీమ్ మీర్ (గుజరాత్) ద్వయం 22-20, 21-19తో శ్రేయ (తెలంగాణ)- ప్రవీణ (తమిళనాడు) జోడీని ఓడించి టైటిల్‌ను కై వసం చేసుకుంది.

బాలుర సింగిల్స్ విభాగంలో శంకర్ ముత్తుసామి (తమిళనాడు) 19-21, 21-11, 21-10తో ఆకాశ్ సింగ్ (ఉత్తరప్రదేశ్)పై నెగ్గగా... డబుల్స్ విభాగంలో వంశీకృష్ణ (ఏపీ)- ఉనీత్ కృష్ణ (తెలంగాణ) ద్వయం 21-16, 21-13తో సతక్ష్ సింగ్ (ఢిల్లీ)- సారుు సర్వేశ్ (పంజాబ్) జోడీపై గెలుపొందింది. అండర్-15 కేటగిరీలో బాలుర సింగిల్స్ ఫైనల్లో సారుుచరణ్ (ఏపీ) 21-16, 21-13తో ఆయూష్ రాజ్ (ఉత్తరప్రదేశ్)పై, బాలికల సింగిల్స్‌లో రిచా ముక్తిబోధ్ (కర్నాటక) 21-12, 21-12తో మేధ శశిధరణ్ (కర్నాటక)పై గెలుపొందారు. డబుల్స్ విభాగంలో ఎడ్విన్ జాయ్- అరవింద్ సురేశ్ (కేరళ) ద్వయం 21-16, 21-18తో బిద్యాసాగర్- పున్షిబా యెంగ్‌కోమ్ (మణిపూర్)జోడీపై విజయం సాధించింది. బాలికల డబుల్స్‌లో కేయూర (తెలంగాణ)-కవిప్రియ (పంజాబ్)జంట 21-15, 21-12తో తన్యా హేమంత్- కీర్తన (కర్నాటక) జోడీని ఓడించి విజేతగా నిలిచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement