గాయత్రి డబుల్ ధమాకా | gayatri gets double dhama | Sakshi
Sakshi News home page

గాయత్రి డబుల్ ధమాకా

Published Mon, Jan 30 2017 10:54 AM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

గాయత్రి డబుల్ ధమాకా

గాయత్రి డబుల్ ధమాకా

సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సబ్‌జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పుల్లెల గాయత్రి సత్తాచాటింది. కోయంబత్తూరులో జరిగిన ఈ టోర్నీలో అండర్-15 బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి టైటిల్స్‌ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో గాయత్రి 20- 22, 21- 17, 21-11తో సామియా ఇమాద్ ఫరూఖీ (తెలంగాణ)పై విజయం సాధించింది. డబుల్స్ విభాగంలో గాయత్రి-సామియా ద్వయం 21- 13, 21-16తో త్రిష జోలీ-మెహరీన్ రిజా జంటను ఓడించి విజేతగా నిలిచింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement