సాయి రాజేష్‌ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్‌ కామెంట్స్‌ | Gayatri Gupta Comment On Sai Rajesh | Sakshi
Sakshi News home page

సాయి రాజేష్‌ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి గుప్తా సెన్సేషనల్‌ కామెంట్స్‌

May 30 2024 10:12 AM | Updated on May 30 2024 11:55 AM

Gayatri Gupta Comment On Sai Rajesh

బేబీ సినిమా కథ నాదేనంటూ  షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌, సినిమాటోగ్రాఫర్‌ శిరిన్‌ శ్రీరామ్‌ కొన్నిరోజులుగా పోరాడుతున్నాడు. గతేడాదిలో ఆనంద్‌ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్‌ ఆనంద్‌ ప్రధాన పాత్రల్లో నటించిన  'బేబీ' చిత్రాన్ని సాయి రాజేశ్‌ దర్శకత్వం వహిస్తే ఎస్‌కేఎన్‌ నిర్మాతగా తెరకెక్కించారు. అయితే, ఈ కథ మొత్తం తనదే అంటూ ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేశ్‌  బేబి సినిమా తీశాడని దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సాక్ష్యాల‌తో స‌హా సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్ అనే బుక్‌ను వెబ్‌సైట్‌లో https://babyleaks2023.blogspot.com/ అందుబాటులోకి తీసుకొచ్చాడు.

బేబీ సినిమా డైరెక్టర్‌ సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ అంటూ పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ఈ బేబీ లీక్స్ బుక్‌ను మీడియా ముందుంచారు. అయితే, తాజాగా సినీ నటి గాయత్రి గుప్తా కూడా ఈ అంశంపై రియాక్ట్‌ అయింది. ఫిదా సినిమాతో పాపులర్‌ అయిన గాయత్రి.. ఐస్‌ క్రీమ్ 2, కొబ్బరిమట్ట, మిఠాయి లాంటి సినిమాల్లో నటించింది. 

బేబీ డైరెక్టర్‌ సాయి రాజేష్ గురించి గాయత్రి ఇలా చెప్పుకొచ్చింది. 'బేబీ సినిమా కథను ప్రేమించొద్దు అనే పేరుతో శిరిన్‌ శ్రీరామ్‌ రాసుకున్నారు. దానిని సాయి రాజేష్‌ కాపీ కొట్టేశాడు. ఈ సినిమాలో మొదటగా హీరోయిన్‌గా నన్ను అనుకున్నారు. అందుకు ఆడిషన్‌ కూడా జరిగింది. స్కూల్‌ డ్రెస్‌లో ఉన్న ఆ ఫోటోలను సాయి రాజేష్‌కు  చూపించాను. దానినే బేబీలో కాపీ కొట్టాడు. ట్రైలర్‌ విడుదల అయ్యాక చూసి నేను షాక్‌ అయ్యాను. సాయి రాజేష్‌తో ఇబ్బందులు నాకు  కొత్త కాదు. ఆయన డైరెక్ట్‌ చేసిన కొబ్బరిమట్టలో కూడా నన్ను ఇబ్బంది పెట్టాడు. 

ఆ సినిమాకు సంబంధించి రూ. 3లక్షలు ఇస్తానన్నారు. కానీ, కేవలం రూ.25 వేలు ఇచ్చి బాగా టార్చర్‌ పెట్టారు. అవన్నీ సరేలే అనుకుంటే.. బేబీ కథను మొదట రాసుకుంది శిరిన్‌. కానీ, సాయి రాజేష్‌ మాత్రం ఆ కథను తానే క్రియేట్‌ చేశానంటాడు. ఇద్దరూ కలిసి ఆ కథతో సినిమా తీద్దామని చివరి క్షణంలో బడ్జెట్‌ లేదని తెలివిగా శిరిన్‌ను తప్పించాడు. అదే కథను శిరిన్‌ నుంచి సాయి రాజేష్‌ కాపీ కొట్టేసి..  గీతా ఆర్ట్స్‌లో చర్చలు జరిపాడు. 

ఆ సంస్థ చాలా మంచిది. కానీ,  పాము లాంటి సాయి రాజేష్‌ను వారు గుర్తించాలి. బేబీ సినిమా కోసం సాయి రాజేష్‌ చాలా చీప్‌ ట్రిక్స్‌ చేశాడు. బేబీ పాత్రను చాలా దారుణంగా చూపించాడు. కొందరైతే హీరోయిన్‌ పోస్టర్‌ను చెప్పులతో కూడా కొట్టారు. అంతలా ఆయన పబ్లిసిటీని ఉపయోగించుకున్నాడు. సాయి రాజేష్‌ లాంటి వ్యక్తి టాలీవుడ్‌కు మచ్చలా మిగిలిపోతాడు. బేబీ కథ రాసుకున్న శిరిన్‌ శ్రీరామ్‌కు న్యాయం జరిగాలి.' అని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement