రుత్వికకు టైటిల్ | rutwika clinches title | Sakshi
Sakshi News home page

రుత్వికకు టైటిల్

Published Sun, Aug 7 2016 11:10 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

రుత్వికకు టైటిల్

రుత్వికకు టైటిల్

హైదరాబాద్: వీవీ నాథూ మెమోరియల్ ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి రుత్విక శివాని సత్తా చాటింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రుత్విక 21-18, 21-6తో తులసిపై గెలుపొంది టైటిల్‌ను దక్కించుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో గురుసాయిదత్ 12-21, 21-17, 14-21తో సౌరభ్ వర్మ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.

 

మహిళల డబుల్స్ ఫైనల్లో సిక్కిరెడ్డి- మనీషా జంట 13-21, 21-18, 21-9తో అపమా బాలన్-ప్రజక్త సావంత్ జోడిని ఓడించగా, పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ శెట్టి జంట 21-16, 21-18తో అర్జున్-శ్లోక్ రామచంద్రన్ జోడిపై గెలుపొందింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయి-మనీషా జంట 18-21, 26-24, 21-14తో జిష్ణు-ప్రజక్త సావంత్ జోడిని ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement