ప్రిక్వార్టర్స్‌లో రుత్విక, ఆర్యమన్ | rutwika, aryaman enter pre quarters | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో రుత్విక, ఆర్యమన్

Published Thu, Nov 24 2016 10:57 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM

rutwika, aryaman enter pre quarters

ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ సిరీస్

సాక్షి, హైదరాబాద్: యొనెక్స్ సన్‌రైజ్ ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ సిరీస్‌లో రుత్విక శివాని, ఆర్యమన్ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో బుధవారం ప్రారంభమైన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో గద్దె రుత్విక శివాని (భారత్) 11-8, 11-4, 11-6తో తనిష్క్ (భారత్)పై గెలుపొందగా... పురుషుల సింగిల్స్ రెండోరౌండ్‌లో ఆర్యమన్ టాండన్ (భారత్) 11-7, 11-4, 11-1తో మనీశ్ గుప్తా (భారత్)ను ఓడించాడు.

 

మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్- జక్కంపూడి మేఘన (భారత్) జోడీ 11-2, 11-8, 7-11, 11-6తో పంగ్ రోన్ హు- యెన్ వెయ్ పెక్ (మలేసియా) జంటపై,  ఉత్తేజిత రావు (భారత్)పై, శ్రీకృష్ణప్రియ 11-9, 11-1, 11-6తో మహేశ్వరి (భారత్)పై గెలుపొందింది.

 

 ఇతర ఫలితాలు


 పురుషుల సింగిల్స్: శ్రేయాన్‌‌ష జైశ్వాల్ (భారత్) 11-9, 11-5, 11-3తో అరింథాప్ దాస్ గుప్తా (భారత్)పై, జియా వెయ్ తాన్ (మలేసియా) 11-8, 11-6, 11-4తో కార్తీకేయ గుల్షాన్ కుమార్ (భారత్)పై, కెయ్ వున్ (మలేసియా) 11-7, 11-8, 11-9తో అజయ్ (భారత్)పై, కిరణ్ జార్జ్ (భారత్) 11-7, 11-4, 11-1తో మనీశ్ (భారత్)పై గెలుపొందారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement