aryaman
-
సచిన్, కోహ్లి కాదు!.. అత్యంత సంపన్న భారత క్రికెటర్ ఇతడే!
భారత్‌లో అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల్లో క్రికెటర్లే అగ్రస్థానంలో ఉంటారు. వారిలోనూ టీమిండియా లెజెండరీ ఆటగాడు, వంద సెంచరీల వీరుడు సచిన్ టెండుల్కర్, దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. అటు ఆట ద్వారా.. ఇటు పలు ప్రఖ్యాత బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించడం ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ ముగ్గురు స్టార్లు ఒక్కొక్కొరు వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని వినికిడి. మరి వీరికంటే ధనవంతుడైన భారత క్రికెటర్ మరొకరు ఉన్నారు. అతడి ఒక్కడి సంపాదనే వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. లక్షల కో ట్ల సంపదకు అతడు వారసుడు. బిజినెస్ టైకూన్ కుమారుడుదేశంలోనే.. కాదు కాదు.. బహుశా ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెటర్ అయిన అతడు మరెవరో కాదు ఆర్యమన్ విక్రమ్ బిర్లా. దిగ్గజ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడు. జూలై 9, 1997లో ముంబైలో జన్మించాడు. పుట్టుకతోనే రిచ్‌కిడ్ అయిన ఆర్యమన్.. క్రికెటర్‌గా తొలి అడుగులు వేశాడు. మధ్యప్రదేశ్ తరఫున 2017- 18లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. లెఫ్టాండ్ బ్యాటర్ అయిన ఆర్యమన్.. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 9 మ్యాచ్‌లు ఆడి 414 పరుగులు సాధించాడు ఆర్యమన్ బిర్లా. రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన రాయల్స్ఇందులో ఓ శతకం, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఇక లిస్ట్-ఏ క్రికెట్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతడు 36 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఆర్యమన్ బిర్లా.. 2018 ఐపీఎల్ వేలంలోకి రాగా.. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా 2019లోనే క్రికెట్‌కు కూడా దూరమయ్యాడు ఆర్యమన్. కుటుంబ వ్యాపారాలతో బిజీ అయ్యాడు. తన సోదరి అనన్య బిర్లాతో కలిసి ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ఓ కంపెనీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. సొంతంగా ముంబైలో ఓ క్లబ్ కూడా కలిగి ఉన్న ఆర్యమన్.. పెంపుడు జంతువు ఓ స్టోర్ కూడా నడుపుతున్నాడు.రెండు లక్షల కోట్లకు పైగా సంపదహురున్ విడుదల చేసిన దేశీయ అత్యంత ధనవంతులు జాబితాలో కుమార్ మంగళం బిర్లా చోటు దక్కించుకోవడంతో.. ఆర్యమన్ బిర్లా పేరు మరోసారి ఇలా తెరపైకి వచ్చింది. ఇక హురున్ రిచ్ లిస్టులో గౌతమ్ అదానీ 11.6 లక్షల కోట్లతో అగ్రస్థానంలో నిలవగా.. ముకేశ్ అంబానీ 10.14 లక్షల కోట్ల నికర ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఆరోస్థానంలో ఉన్న కుమార్ మంగళం బిర్లా 2,35,200 కోట్ల నికర సంపద కలిగి ఉన్నారు. ఈ క్రమంలో ఆర్యమన్ నెట్‌వర్త్ డెబ్బై వేల కోట్లకు పైగానే ఉంటుందని వ్యాపారవర్గాలు అంటున్నాయి.చదవండి: క్రికెటర్ సంచలన నిర్ణయం.. 26 ఏళ్లకే ఆటకు వీడ్కోలు! -
రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఎవరో తెలుసా?
కుమార మంగళం బిర్లా నేతృత్వంలోనిఆదిత్య బిర్లా గ్రూప్ నావెల్ జ్యువెల్స్ లిమిటెడ్ పేరుతో బ్రాండెడ్ జ్యువెలరీ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. బడా బాబులే లక్క్ష్యంగా హై క్వాలిటీ జ్యువెలరీ రంగంలో రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ నేపథ్యంలో రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఆర్యమాన్ బిర్లా గురించి ఆసక్తి నెలకొంది. 60 బిలియన్ డాలర్లు (రూ. 4,95,000 కోట్లు) నికర విలువతో ఆదిత్య బిర్లా గ్రూప్ నికర విలుతో మెటల్, పల్ప్ ఫైబర్, సిమెంట్, కెమికల్స్, టెక్స్టైల్స్, కార్బన్ బ్లాక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫ్యాషన్ రిటైల్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలలో దూసుకుపోతోంది. గత రెండు సంవత్సరాలలో పెయింట్స్, B2B ఈ-కామర్స్ బిజినెస్‌తోపాటు మూడు పెద్ద వ్యాపారాల్లోకి ప్రవేశించింది ఇపుడిక ఆభరణాల బిజినెస్‌లో అటు టాటా గ్రూప్ తనిష్క్, ఇటు రిలయన్స్‌కు ప్రధాన ప్రత్యర్థిగా పోటీ పడనుంది. (తనిష్క్, రిలయన్స్‌కు చేదువార్త: వేల కోట్లతో మరో దిగ్గజం ఎంట్రీ) గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా కుమారుడే ఆర్యమాన్ బిర్లా కుమార్. 25 ఏళ్ల ఆర్యమాన్ బిర్లా గ్రాసిమ్, హిందాల్కో, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, రిటైల్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ వంటి దిగ్గజ విభాగాల బాధ్యతల్లో ఉన్నాడు. ఆర్యమాన్ ఒకపుడు దేశీయ క్రికెటర్‌గా ఆకట్టుకున్నాడు. 2017-2018 రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు.2018 ఐపీఎల్ వేలంలో అతన్ని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఇక్కడ తన తొలి హాఫ్ సెంచరీ కొట్టి వార్తల్లో నిలిచాడు. (నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం) ESPN Cricinfo ప్రకారం, అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 9 మ్యాచ్‌లు ఆడి, ఒక సెంచరీ ఒక అర్ధ సెంచరీతో సహా 414 పరుగులు చేశాడు. లిస్ట్ A క్రికెట్లో నాలుగు మ్యాచ్‌ల్లో 36 పరుగులు చేశాడు.అండర్-23 CK నాయుడు ట్రోఫీ 2017-18లో, ఆరు మ్యాచ్‌ల్లో 795 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. 10 వికెట్లు కూడా తీశాడు. అత్యంత సంపన్న క్రికెటర్, కానీ భారత్ లో అంత్యంత సంపన్న క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న ఆర్యమన్ బిర్లాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అంతర్జాతీయ క్రికెటర్ కావాలనేది అతని డ్రీమ్. ఆల్ రౌండర్‌గా రాణించాలనుకున్నాడు కానీ ఆందోళన, ఇతర ఆరోగ్య కారణాల రీత్యా క్రికెట్‌నుంచి తప్పుకున్నట్టు ఫెమినా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఆర్యమాన్ బిర్లా , అతని సోదరి అనన్య బిర్లా గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లోకి డైరెక్టర్స్ ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆదిత్య బిర్లా వెంచర్స్ అనే కంపెనీ వెంచర్ క్యాపిటల్ ఫండ్ హెడ్ కూడా. అలాగే D2C ప్లాట్‌ఫారమ్ TMRW బోర్డు డైరెక్టర్ కూడా.బిర్లాకుమార్తె అనన్య 17 సంవత్సరాల వయస్సులో తొలి కంపెనీ Svatantra Microfin Pvt Ltdని స్థాపించింది. అలాగే Ikai Asai అనే ఇంటి అలంకరణ బ్రాండ్‌ను కూడా స్థాపించింది. ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీలు,ఇంట్రస్టింగ్ అప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
అత్యంత సంపన్న క్రికెటర్ ఇతనేనంటే నమ్ముతారా!
ముంబై: భారతదేశంలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరంటే ఏం ఆలోచించకుండా వెంటనే విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని అనే పేర్లు వినిపిస్తాయి. కానీ ఈ ప్రశ్నకు సమాధానం వీరెవరూ కాదంటే మీరు నమ్మగలరా. వ్యాపార దిగ్గజం కుమార్ మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్ బిర్లా ప్రస్తుతం దేశవాలి క్రికెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మధ్యప్రదేశ్ జట్టు తరపున రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. 2018లో ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఇతడిని రూ. 31 లక్షలకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం కుమార్ మంగళం బిర్లా ఆస్తుల విలువ 70 వేల కోట్లు. త్వరలోనే బిర్లా వ్యాపార సామ్రాజ్యానికి ఆర్యమన్ అధిపతి కానున్నాడు. ఈ లెక్క ప్రకారం భారత దేశంలో అత్యంత సంపన్న క్రికెటర్‌గా పేరు సంపాదించనున్నాడు. 23 ఏళ్ల ఆర్యమన్ బిర్లాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం, అంతర్జాతీయ క్రికెటర్‌గా మంచి గుర్తింపు సంపాదించాలని కలలు కనేవాడు. అందుకోసం ఈ జూనియర్ బిర్లా ప్రతిరోజూ మైదానంలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెటర్ల జాబతాలో తన పేరుని చూసుకోవడానికి కఠినమైన శిక్షణ పొందుతున్నాడు. ఆర్యమన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మాన్, లెఫ్ట్ ఆర్మ్ఆర్థోడాక్స్ బౌలర్. మీ ఇంటి పేరు కారణంగా ఏమైనా ఒత్తిడి ఉందా అని ఆర్యమన్‌ను ఎవరైనా అడిగితే.. అతను చెప్పే సమాధానం ఏంటో తెలుసా.. 'నేను నా సొంతంగా ఎదగడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తా అని చెప్పుకొచ్చేవాడు. 2017న ఇండోర్‌లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆర్యమన్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఒడిశాపై కేవలం 22 పరుగులు చేశాడు. తరువాత సీ.కే.నాయుడు ట్రోఫీలో అతను 11 ఇన్నింగ్స్‌లలో ఆరు మ్యాచ్‌లు ఆడి 79.50 సగటుతో 795 పరుగులు చేశాడు. ఇక జూనియర్ స్థాయిలో మధ్యప్రదేశ్‌కు ఆడిన ఆర్యమన్ నాలుగు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీలు సాధించాడు. ( చదవండి: సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్ ) -
‘బిర్లా’కూ మానసిక ఆందోళన!
ముంబై: అతని వయసు 22 ఏళ్లు... కాలు కదపాల్సిన అవసరం లేకుండానే సిద్ధంగా ఉన్న కోట్ల రూపాయల సామ్రాజ్యం...దేశాన్ని శాసించగల సంపద ఉన్న వ్యక్తి కుమారుడు...కానీ అతడిని కూడా మానసిక ఆందోళన వదల్లేదు. తాను ఎంచుకున్న దారిలో లక్ష్యం చేరుకోలేకపోవడం, అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడం బహుశా అందుకు కారణం కావచ్చు! ఆ కుర్రాడి పేరు ఆర్యమాన్ బిర్లా. ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా కొడుకు. మధ్య ప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతూ వచ్చిన ఆర్యమాన్ మానసికపరమైన ఆందోళనతో క్రికెట్‌నుంచి ‘నిరవధిక విరామం’ విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. తాను ఇష్టపడిన ఆటలో సాధ్యమైనంతంగా శ్రమించానని, అయితే ఇకపై తన ప్రయాణం గురించి కొత్తగా ఆలోచించాల్సి ఉందంటూ అతను వెల్లడించాడు. ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్ అయిన ఆర్యమాన్ 9 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 27.60 సగటుతో 414 పరుగులు, 4 లిస్ట్–ఎ మ్యాచ్‌లలో 36 పరుగులు చేశాడు. 2018 ఐపీఎల్ వేలంలో అతడిని రూ. 30 లక్షలకు తీసుకున్న రాజస్తాన్ గత ఏడాది కూడా కొనసాగించింది. అయితే రెండు సీజన్లలో కలిపి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఈ సారి దేశవాళీ క్రికెట్ సీజన్ బరిలోకి దిగకపోగా, ఐపీఎల్ వేలంలోనూ పాల్గొనలేదు. -
ప్రిక్వార్టర్స్‌లో రుత్విక, ఆర్యమన్
ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ సిరీస్ సాక్షి, హైదరాబాద్: యొనెక్స్ సన్‌రైజ్ ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ సిరీస్‌లో రుత్విక శివాని, ఆర్యమన్ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో బుధవారం ప్రారంభమైన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో గద్దె రుత్విక శివాని (భారత్) 11-8, 11-4, 11-6తో తనిష్క్ (భారత్)పై గెలుపొందగా... పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో ఆర్యమన్ టాండన్ (భారత్) 11-7, 11-4, 11-1తో మనీశ్ గుప్తా (భారత్)ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్- జక్కంపూడి మేఘన (భారత్) జోడీ 11-2, 11-8, 7-11, 11-6తో పంగ్ రోన్ హు- యెన్ వెయ్ పెక్ (మలేసియా) జంటపై, ఉత్తేజిత రావు (భారత్)పై, శ్రీకృష్ణప్రియ 11-9, 11-1, 11-6తో మహేశ్వరి (భారత్)పై గెలుపొందింది. ఇతర ఫలితాలు పురుషుల సింగిల్స్: శ్రేయాన్‌ష జైశ్వాల్ (భారత్) 11-9, 11-5, 11-3తో అరింథాప్ దాస్ గుప్తా (భారత్)పై, జియా వెయ్ తాన్ (మలేసియా) 11-8, 11-6, 11-4తో కార్తీకేయ గుల్షాన్ కుమార్ (భారత్)పై, కెయ్ వున్ (మలేసియా) 11-7, 11-8, 11-9తో అజయ్ (భారత్)పై, కిరణ్ జార్జ్ (భారత్) 11-7, 11-4, 11-1తో మనీశ్ (భారత్)పై గెలుపొందారు.