ముంబై: భారతదేశంలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరంటే ఏం ఆలోచించకుండా వెంటనే విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని అనే పేర్లు వినిపిస్తాయి. కానీ ఈ ప్రశ్నకు సమాధానం వీరెవరూ కాదంటే మీరు నమ్మగలరా.
వ్యాపార దిగ్గజం కుమార్ మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్ బిర్లా ప్రస్తుతం దేశవాలి క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మధ్యప్రదేశ్ జట్టు తరపున రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. 2018లో ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఇతడిని రూ. 31 లక్షలకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం కుమార్ మంగళం బిర్లా ఆస్తుల విలువ 70 వేల కోట్లు. త్వరలోనే బిర్లా వ్యాపార సామ్రాజ్యానికి ఆర్యమన్ అధిపతి కానున్నాడు. ఈ లెక్క ప్రకారం భారత దేశంలో అత్యంత సంపన్న క్రికెటర్‌గా పేరు సంపాదించనున్నాడు.
23 ఏళ్ల ఆర్యమన్ బిర్లాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం, అంతర్జాతీయ క్రికెటర్‌గా మంచి గుర్తింపు సంపాదించాలని కలలు కనేవాడు. అందుకోసం ఈ జూనియర్ బిర్లా ప్రతిరోజూ మైదానంలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెటర్ల జాబతాలో తన పేరుని చూసుకోవడానికి కఠినమైన శిక్షణ పొందుతున్నాడు. ఆర్యమన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మాన్, లెఫ్ట్ ఆర్మ్ఆర్థోడాక్స్ బౌలర్. మీ ఇంటి పేరు కారణంగా ఏమైనా ఒత్తిడి ఉందా అని ఆర్యమన్‌ను ఎవరైనా అడిగితే.. అతను చెప్పే సమాధానం ఏంటో తెలుసా.. 'నేను నా సొంతంగా ఎదగడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తా అని చెప్పుకొచ్చేవాడు.
2017న ఇండోర్‌లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆర్యమన్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఒడిశాపై కేవలం 22 పరుగులు చేశాడు. తరువాత సీ.కే.నాయుడు ట్రోఫీలో అతను 11 ఇన్నింగ్స్‌లలో ఆరు మ్యాచ్‌లు ఆడి 79.50 సగటుతో 795 పరుగులు చేశాడు. ఇక జూనియర్ స్థాయిలో మధ్యప్రదేశ్‌కు ఆడిన ఆర్యమన్ నాలుగు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీలు సాధించాడు. ( చదవండి: సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్ )
Comments
Please login to add a commentAdd a comment