భారత్‌లో అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల్లో క్రికెటర్లే అగ్రస్థానంలో ఉంటారు. వారిలోనూ టీమిండియా లెజెండరీ ఆటగాడు, వంద సెంచరీల వీరుడు సచిన్ టెండుల్కర్, దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. అటు ఆట ద్వారా.. ఇటు పలు ప్రఖ్యాత బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించడం ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్నారు.
ఈ ముగ్గురు స్టార్లు ఒక్కొక్కొరు వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని వినికిడి. మరి వీరికంటే ధనవంతుడైన భారత క్రికెటర్ మరొకరు ఉన్నారు. అతడి ఒక్కడి సంపాదనే వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. లక్షల కో ట్ల సంపదకు అతడు వారసుడు.
బిజినెస్ టైకూన్ కుమారుడు
దేశంలోనే.. కాదు కాదు.. బహుశా ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెటర్ అయిన అతడు మరెవరో కాదు ఆర్యమన్ విక్రమ్ బిర్లా. దిగ్గజ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడు. జూలై 9, 1997లో ముంబైలో జన్మించాడు. పుట్టుకతోనే రిచ్‌కిడ్ అయిన ఆర్యమన్.. క్రికెటర్‌గా తొలి అడుగులు వేశాడు.
మధ్యప్రదేశ్ తరఫున 2017- 18లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. లెఫ్టాండ్ బ్యాటర్ అయిన ఆర్యమన్.. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 9 మ్యాచ్‌లు ఆడి 414 పరుగులు సాధించాడు ఆర్యమన్ బిర్లా.
రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన రాయల్స్
ఇందులో ఓ శతకం, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఇక లిస్ట్-ఏ క్రికెట్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతడు 36 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఆర్యమన్ బిర్లా.. 2018 ఐపీఎల్ వేలంలోకి రాగా.. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.
అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా 2019లోనే క్రికెట్‌కు కూడా దూరమయ్యాడు ఆర్యమన్. కుటుంబ వ్యాపారాలతో బిజీ అయ్యాడు. తన సోదరి అనన్య బిర్లాతో కలిసి ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ఓ కంపెనీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. సొంతంగా ముంబైలో ఓ క్లబ్ కూడా కలిగి ఉన్న ఆర్యమన్.. పెంపుడు జంతువు ఓ స్టోర్ కూడా నడుపుతున్నాడు.
రెండు లక్షల కోట్లకు పైగా సంపద
హురున్ విడుదల చేసిన దేశీయ అత్యంత ధనవంతులు జాబితాలో కుమార్ మంగళం బిర్లా చోటు దక్కించుకోవడంతో.. ఆర్యమన్ బిర్లా పేరు మరోసారి ఇలా తెరపైకి వచ్చింది. ఇక హురున్ రిచ్ లిస్టులో గౌతమ్ అదానీ 11.6 లక్షల కోట్లతో అగ్రస్థానంలో నిలవగా.. ముకేశ్ అంబానీ 10.14 లక్షల కోట్ల నికర ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు.
ఇక ఆరోస్థానంలో ఉన్న కుమార్ మంగళం బిర్లా 2,35,200 కోట్ల నికర సంపద కలిగి ఉన్నారు. ఈ క్రమంలో ఆర్యమన్ నెట్‌వర్త్ డెబ్బై వేల కోట్లకు పైగానే ఉంటుందని వ్యాపారవర్గాలు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment