సెమీస్‌లో రుత్విక శివాని, లక్ష్యసేన్ | rutwika shivani enters semis in badminton tourny | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో రుత్విక శివాని, లక్ష్యసేన్

Published Sat, Nov 26 2016 11:11 AM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

rutwika shivani enters semis in badminton tourny

ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ

 
సాక్షి, హైదరాబాద్: యొనెక్స్ సన్‌రైజ్ ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రుత్విక శివాని, లక్ష్యసేన్ సెమీస్‌కి చేరుకున్నారు. గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో రుత్విక శివాని 11-5, 11-6, 11-8తో రేష్మ కార్తీక్‌పై గెలుపొందగా... పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 10-12, 11-4, 11-8, 6-11, 11-9తో మునావర్‌ను ఓడించాడు. మరోవైపు పురుషుల డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో అర్జున్- రామచంద్రన్ శ్లోక్ ద్వయం 11-6, 12-10, 11-7తో అనిల్‌కుమార్- వెంకట్ గౌరవ్ జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో మహిమా అగర్వాల్- శిఖా గౌతమ్ ద్వయం 10-12, 11-7, 7-11, 11-4,11-9తో కుహూ గార్గ్- హజరికా జోడీపై, మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్స్‌లో బషీర్ సయ్యద్- సాహితి జోడీ 13-11, 4-11, 12-10, 15-14తో అక్షయ్- రుప్సా ఘోష్ జంటపై గెలుపొందాయి.

 ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు
 మహిళల సింగిల్స్: శ్రీకృష్ణ ప్రియ 11-6, 8-11, 11-3, 11-5తో కేయూరపై, రీతూపర్ణ దాస్ 9-11, 12-10, 11-5, 11-2తో శిఖా గౌతమ్‌పై, శ్రుతి 12-10, 11-8, 11-7తో స్మిత్ తోష్ని వాల్‌పై విజయం సాధించారు.
 పురుషుల సింగిల్స్: శ్రేయాన్‌‌ష జైశ్వాల్ 11-6, 9-11, 11-9, 11-4తో కెయ్ వున్ థీ (మలేసియా)పై, జున్ వెయ్ చెమ్ (మలేసియా) 11-2, 8-11, 11-6, 11-8తో అన్సల్ యాదవ్ (భారత్)పై, జి జియా లీ (మలేసియా) 7-11, 11-6, 11-8, 11-8తో అభిషేక్ పై గెలిచారు.

 పురుషుల డబుల్స్: సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ జోడీ 11-9, 11-7, 11-8తో నరేంద్రన్- సంజిత్ జంటపై, ఆరోన్- జిన్ హువా థాన్ (మలేసియా) జోడీ 11-7, 11-7, 11-8తో కేతన్ చాహల్- నీరజ్ వశిష్ట్‌పై నెగ్గారు.

 మిక్స్‌డ్ డబుల్స్: సాత్విక్ సాయిరాజ్- మనీషా జోడీ 8-11, 12-10, 12-10, 4-11, 11-7తో ధ్రువ్ కపిల- మేఘన జంటపై, విఘ్నేశ్- కుహు గార్గ్ జోడీ 11-7, 11-6, 11-6తో శ్రీకృష్ణ సాయి- సృష్టి జంటపై గెలుపొందారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement