క్వార్టర్స్‌లో వృశాలి, సుప్రియ | vrushali enters quarters in badminton tourny | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో వృశాలి, సుప్రియ

Published Sat, Aug 13 2016 11:07 AM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

vrushali enters quarters in badminton tourny

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో వృశాలి, సుప్రియ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మంచిర్యాలలో జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో వృశాలి (రంగారెడ్డి) 21-3, 21-4తో బ్రాహ్మిణి (నల్లగొండ)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో సుప్రియ (రంగారెడ్డి) 21-18, 21-16తో నితిష (వరంగల్)పై గెలుపొందింది. పరుషుల డబుల్స్‌లో భవదీర్ (హైదరాబాద్)-విఘ్నేష్ రామన్ (రంగారెడ్డి) జోడి 21-15, 21-10తో క్రాంతికుమార్- అరుణ్ (వరంగల్) జంటపై నెగ్గి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.


 ఇతర మ్యాచ్‌ల ఫలితాలు


 పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ ఫలితాలు


 సతీశ్ (హైదరాబాద్) 21-9, 21-11తో రాహుల్ (రంగారెడ్డి)పై, అఖిలేశ్వర్ (ఆదిలాబాద్) 21-11, 21-10తో శ్రీనివాస్ (నల్లగొండ)పై, ఆదిత్య (ఖమ్మం)21-6,21-2తో వంశీకృష్ణ (నిజామాబాద్)పై, విజేత (హైదరాబాద్0 21-11, 21-10తో అనిష్ (వరంగల్)పై, క్రాంతికుమార్ (వరంగల్) 21-14, 21-5తో శ్రీకాంత్ (ఖమ్మం)పై, భార్గవ (రంగారెడ్డి) 21-11, 21-16తో సాయి కుమార్( ఆదిలాబాద్)పై, సాయం బోత్రా (హైదరాబాద్) 21-19, 16-21, 21-12తో ఖాజా జలీమ్ (నల్లగొండ)పై, అనురాగ్ (రంగారెడ్డి) 21-6, 21-6తో శివ (నల్గొండ)పై, గోపాలకృష్ణ (రంగారెడ్డి) 21-5, 21-10తో శ్రవణ్ (మహబూబ్‌నగర్)పై, భవదీర్ (హైదరాబాద్) 21-5, 21-8తో నాగరాజ్ (ఖమ్మం)పై, సాగర్ (మెదక్ 21-8, 21-5తో కార్తీక్ (నిజామాబాద్)పై, ఆదిత్య (హైదరాబాద్) 21-10, 11-21, 21-10తో అనిల్ (వరంగల్)పై గెలుపొందారు.


 మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ ఫలితాలు


 ప్రమద (మెదక్) 21-1, 21-0తో దుర్గా భవాని (ఆదిలాబాద్)పై, వంశిక (రంగారెడ్డి) 9-21, 21-18, 21-14తో ప్రణాలికర్ని (హైదరాబాద్)పై, పూజ (హైదరాబాద్) 21-3, 21-2తో మోహన సాయి ప్రియ (ఆదిలాబాద్)పై, పూర్వి సింగ్ (నిజామాబాద్) 18-21, 21-18, 21-15తో ఆఫ్రిన్ (హైదరాబాద్)పై, వైష్ణవి (రంగారెడ్డి) 21-8, 21-9తో పూజపై విజయం సాధించారు.


 పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్ ఫలితాలు


 రాహుల్- గోపి రాజు (హైదరాబాద్) జోడి 21-11, 21-12తో రఫిక్-రవి (ఆదిలాబాద్) జంటపై, రితిన్-అనిష్ (వరంగల్) జోడి 21-17, 21-16తో సాయి కుమార్- విన్సెంట్ (ఆదిలాబాద్) జంటపై, గోపాలకృష్ణ (రంగారెడ్డి)-ఆదిత్య (ఖమ్మం) జోడి 21-12, 21-10తో నాగరాజు-రామకృష్ణ (ఖమ్మం) జంటపై, రాహుల్ - శ్రవ ణ్ (రంగారెడ్డి) జోడి 21-16, 21-10తో అజయ్-జితేందర్ (కరీంనగర్) జంటపై నెగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement