మహిళలు తిరగబడితే? | Trinetri Movie Shooting Completed | Sakshi
Sakshi News home page

మహిళలు తిరగబడితే?

Published Thu, Jul 5 2018 12:22 AM | Last Updated on Tue, Sep 18 2018 8:13 PM

Trinetri Movie Shooting Completed - Sakshi

పోసాని కృష్ణమురళి

మేఘన, ఆరోహి, వృశాలి, పోసాని కృష్ణమురళి ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘త్రినేత్రి’. తిరుపతి కె. వర్మ దర్శకత్వంలో ఎడవెల్లి వెంకట్‌ రెడ్డి, కాచిడి గోపాల్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. తిరుపతి కె. వర్మ మాట్లాడుతూ–  ‘‘ఆడవాళ్లపై జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. మహిళలు తిరగబడితే ఎలా ఉంటుంది? అన్నదే కథ. పోసానిగారి పాత్ర ఈ సినిమాకి హైలైట్‌గా ఉంటుంది. త్వరలో ట్రైలర్‌ విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘పోసానిగారు మా సినిమా కథ విని చాలా బాగుంది, కచ్చితంగా మంచి హిట్‌ అవుతుందన్నారు’’ నిర్మాతలు. ఈ చిత్రానికి సమర్పణ: ఎడవెల్లి రాంరెడ్డి, కెమెరా: చారి,  సంగీతం: జయంత్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement