
సాక్షి, హైదరాబాద్: పోలిష్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి గుమ్మడి వృశాలి సంచలనం సృష్టించింది. పోలాండ్‌లోని బీరన్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో వృశాలి 23–21, 21–19తో టాప్ సీడ్ కేట్ ఫ్యూ కున్ (మారిషస్)ను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.
తొలి రౌండ్‌లో ఏడో సీడ్ సారా పెనాల్వార్ పెరీరా (స్పెయిన్)పై 20–22, 21–12, 21–11తో నెగ్గిన వృశాలి... ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–11, 21–13తో మోనికా సుజోక్ (హంగేరి)ను ఓడించింది. భారత్‌కే చెందిన రితూపర్ణ దాస్ కూడా సెమీస్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో రితూపర్ణ 21–7, 21–14తో జార్జినా బ్లాండ్ (ఇంగ్లండ్)పై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment