
మైత్రివనం ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్న సుకుమార్
‘‘మైత్రివనం’ సినిమా ఫస్ట్ లుక్‌లో కొత్తదనం కనిపిస్తోంది. రవిచరణ్ నాకు తెలుసు. సినిమా కోసం బాగా కష్టపడతాడు. సినిమా వినూత్నంగా తెరకెక్కించి ఉంటారనుకుంటున్నా. సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు సుకుమార్. విశ్వ, కిషోర్, వృషాలీ, హర్షదా పాటిల్ ముఖ్య తారలుగా రవిచరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మైత్రివనం’. ‘ఫీనిక్స్ ఎల్ వీ’ అన్నది ఉపశీర్షిక. లక్ష్మీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుఖేష్ ఈశ్వరగారి నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మోషన్ పోస్టర్‌కు ప్రత్యామ్నాయంగా సిద్ధం చేసిన ‘మైత్రివనం’ మూవీ గ్రీటింగ్‌ని, ఫస్ట్ లుక్‌ని సుకుమార్ ఆవిష్కరించారు.
రవిచరణ్ మాట్లాడుతూ– ‘‘కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రకథ రాసుకున్నా. ఈ విశ్వంలో మనిషి తలచుకుంటే ఏదైనా చేయగలడు.. ఎంత కష్టమైన లక్ష్యాన్ని అయినా సాధించగలడు. అద్భుతాలు సృష్టించగలడు.. అని చెప్పేందుకు చేసిన ప్రయత్నమే ఈ సినిమా’’ అన్నారు. ‘‘యువతకు నచ్చేలా మంచి సందేశంతో పాటు ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించిన చిత్రమిది. మే నెలలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు సుఖేష్ ఈశ్వరగారి. ఈ చిత్రానికి సంగీతం–ఎడిటర్: కిషోర్ మద్దాలి, కెమెరా: పరంధామ.
Comments
Please login to add a commentAdd a comment