maitrivanam
-
ఈ సమయం మాస్క్ తోనే
-
ప్రముఖ డైరెక్టర్‌ను అరెస్టు చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడిపై నగర వాసులు బుధవారం కేసు నమోదు చేశారు. అమీర్‌పేట మైత్రీవనం కూడలి వద్ద అశ్లీలంగా సినీ పోస్టర్లు పెట్టారంటూ డైరెక్టర్ నరసింహ నంది, నిర్మాత శ్రీనివాస్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసిన సంజీవరెడ్డి నగర్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. హైస్కూల్, కమలతో నా ప్రయాణం, లజ్జ వంటి సినిమాలను డైరెక్టర్ నర్సింహ నంది తెరకెక్కించారు. అలాగే జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు కూడా అందుకున్నారు. 2008లో 1940లో ఒక గ్రామం చిత్రానికి ఆయన జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం, నంది పురస్కారాన్ని పొందారు. 2013లో 60వ జాతీయ చిత్ర పురస్కారాలలో దక్షిణ విభాగం-2కు తన సేవలందించారు. -
వాస్తవ సంఘటనలతో...
‘మైత్రీవనం’ అంటే హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉండే ఓ ఏరియా అనుకునేరు. ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమా రూపొందింది. లక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుఖేశ్ ఈశ్వరగారి, జెట్టి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవిచరణ్ దర్శకుడు. విశ్వ, వెంకట్, వృషాలీ, హర్షదా పాటిల్, రాజ్ బాలా ప్రధాన పాత్రల్లో నటించారు. పీఆర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మల్కాపురం శివకుమార్, కల్వకుంట్ల కన్నారావుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. చిత్రదర్శకుడు రవిచరణ్ మాట్లాడుతూ – ‘‘యువతలో ఉన్న శక్తి అపారం. అది ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చేయగలదు. ఆ శక్తిని యువత గుర్తించేలా చేసే చిత్రమిది. కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ కథను రాసుకున్నాను. పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తూనే సందేశాత్మకంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఒక చిన్న ఆలోచనతో మొదలైన చిత్రమిది. దర్శకుడు రవిగారు సరదాగా చెప్పిన ఓ పాయింట్ నచ్చి కథని విస్తృతం చేసి, ఈ సినిమా తీశాం. ఇప్పుడున్న చిత్రాల్లో కొత్త ఒరవడిని సృష్టించే చిత్రం అవుతుందని చెప్పగలను’’ అన్నారు సుఖేష్. -
ఫస్ట్ లుక్‌లో కొత్తదనం కనిపిస్తోంది
‘‘మైత్రివనం’ సినిమా ఫస్ట్ లుక్‌లో కొత్తదనం కనిపిస్తోంది. రవిచరణ్ నాకు తెలుసు. సినిమా కోసం బాగా కష్టపడతాడు. సినిమా వినూత్నంగా తెరకెక్కించి ఉంటారనుకుంటున్నా. సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు సుకుమార్. విశ్వ, కిషోర్, వృషాలీ, హర్షదా పాటిల్ ముఖ్య తారలుగా రవిచరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మైత్రివనం’. ‘ఫీనిక్స్ ఎల్ వీ’ అన్నది ఉపశీర్షిక. లక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుఖేష్ ఈశ్వరగారి నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మోషన్ పోస్టర్‌కు ప్రత్యామ్నాయంగా సిద్ధం చేసిన ‘మైత్రివనం’ మూవీ గ్రీటింగ్‌ని, ఫస్ట్ లుక్‌ని సుకుమార్ ఆవిష్కరించారు. రవిచరణ్ మాట్లాడుతూ– ‘‘కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రకథ రాసుకున్నా. ఈ విశ్వంలో మనిషి తలచుకుంటే ఏదైనా చేయగలడు.. ఎంత కష్టమైన లక్ష్యాన్ని అయినా సాధించగలడు. అద్భుతాలు సృష్టించగలడు.. అని చెప్పేందుకు చేసిన ప్రయత్నమే ఈ సినిమా’’ అన్నారు. ‘‘యువతకు నచ్చేలా మంచి సందేశంతో పాటు ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించిన చిత్రమిది. మే నెలలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు సుఖేష్ ఈశ్వరగారి. ఈ చిత్రానికి సంగీతం–ఎడిటర్: కిషోర్ మద్దాలి, కెమెరా: పరంధామ. -
అమీర్‌పేట వెళుతున్నారా.. ఇది గమనించండి
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట ప్రధాన రహదారిలో ప్రారంభమైన ట్రాన్స్‌కో 132 కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్ నిర్మాణ పనుల కారణంగా అమీర్‌పేట నుంచి పంజగుట్ట నిమ్స్ వరకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 24 నుంచి మే 31వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని సూచించారు. మళ్లింపు ఇలా... సంగారెడ్డి, జహిరాబాద్, పటాన్చెరువు వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు పంజగుట్ట నుంచి అనుమతించరు. కూకట్పల్లి వై జంక్షన్ నుంచి నర్సాపూర్ క్రాస్ రోడ్, బాలానగర్, ఫిరోజ్‌గూడ, బోయిన్పల్లి జంక్షన్, తాడ్బంద్జంక్షన్, బాలంరాయి జంక్షన్,ప్యారడైజ్ హోటల్ ఎంజీ రోడ్, రాణిగంజ్, ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్, ఏజీ ఆఫీస్, రవీంద్రభారతి మీదుగా ఇమ్లిబన్ బస్‌స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. పఠాన్‌చెరువు, మియాపూర్, కూకట్పల్లి నుంచి వచ్చే ఆంధ్ర, రాయలసీమ ప్రైవేట్ బస్సులు అమీర్‌పేట, పంజగుట్ట వైపు అనుమతించరు. మైత్రివనం వద్దే మళ్లించి ఎస్ఆర్నగర్ గౌతండిగ్రీ కాలేజీ వద్ద యూ టర్న్ తీసుకొని అక్కడే ప్రయాణికులను ఎక్కించుకోవాల్సి ఉంటుంది. సిటీ బస్సులు, లారీలు, పెట్రోల్ డీజిల్ ఎల్పీజీ ట్యాంకులు, పటాన్ చెరువు, మియాపూర్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్పల్లి నుంచి ఖైరతాబాద్ వెళ్లాలంటే ఎస్ఆర్నగర్ చౌరస్తాలో ఉమేష్ చంద్రా విగ్రహం వద్ద ఎడమ వైపు తీసుకొని కమ్యూనిటీ హాల్, ఆర్ అండ్బి సిగ్నల్, సోనాబాయి టెంపుల్, అమీర్‌పేట్, బీకే రోడ్డు, కాకతీయ హోటల్, సోమాజిగూడ రాజీవ్‌గాంధీ విగ్రహం చౌరస్తా వద్ద ఎడమ వైపు తీసుకొని రాజ్‌భవన్ రోడ్డులో ఖైరతాబాద్ జంక్షన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. -
అమీర్‌పేట మైత్రీవనం వద్ద బాంబు కలకలం
ఎప్పుడూ సందడిగా ఉండే అమీర్‌పేట మైత్రీవనం సమీపంలో బాంబు ఉందంటూ వచ్చిన వదంతులతో ఒక్కసారిగా కలకలం రేగింది. సత్యం థియేటర్ సమీపంలో ఒక సూట్‌కేసు అనుమానాస్పద పరిస్థితులలో కనిపిచండంతో అక్కడ ఉన్నవాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు బాంబుస్క్వాడ్ చేరుకుని ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. పాస్‌పోర్ట్ ఆపీసు ఎదురుగా ఉన్న టిఫెన్ సెంటర్‌వద్ద పడిఉన్న సూట్‌కేస్‌ను బాంబు స్వ్కాడ్ తెరిచి చూడగా అందులో ల్యాప్‌టాప్, చార్జర్, కొన్ని దుస్తులు, కాగితాలు మాత్రం ఉన్నాయి. పాస్‌పోర్ట్ పనిమీద వచ్చిన ఎవరో హడావుడిగా టిఫెన్‌చేసి సూట్‌కేస్‌ను మరిచిపోయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. సూట్‌కేస్ బాంబు ఉందని ప్రచారం జరగడంతో పాస్‌పార్ట్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే అక్కడ ఎలాంటి బాంబు లేదని స్క్వాడ్ సభ్యులు తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబుస్వ్కాడ్ వచ్చి సూట్ కేసును తెరిచి చూసే వరకూ ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. -
హైదరాబాద్ మైత్రివనంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్ పేట సమీపంలోని మైత్రీ వనం పోస్టాఫీసులో అగ్నిప్రమాదం జరిగింది. పోస్టాఫీస్‌లో ఉన్న ఫైల్స్ కాలి బూడిదయ్యాయి. ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. దీన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు. -
మైత్రీవనం వద్ద అదే సీన్
ఒకే ఒక్క గంట కురిసిన జడివాన అమీర్‌పేట్‌ను గడగడలాడించింది. జనసంద్రంగా ఉండే ప్రధాన రహదారి జలసాగరంగా మారిపోయింది. ఎప్పటిలాగానే మైత్రీవనమ్ చౌరస్తా గో‘దారి’ని తలపించింది. మైత్రీవనం వద్ద భారీగా చేరిన నీటితో ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. దీని ప్రభావం అటు ఎస్ఆర్నగర్, ఇటు పంజగుట్ట జంక్షన్లపై కూడా పడింది. చౌరస్తాలో నిలబడి విధులు నిర్వర్తించేందుకు కూడా ఆస్కారం లేకపోవడంతో ట్రాఫిక్ సిబ్బంది సైతం చేతులెత్తేశారు. వేసవి కాలం ప్రారంభంలో కురిసిన కొద్దిసేపు వర్షానికే మైత్రీవనం చౌరస్తా మునిగిపోవడం వెనుక నాలా పూడికతీత పనులు పూర్తిస్థాయిలో జరగకపోవడమే కారణమని పలువురు పేర్కొంటున్నారు. గత ఏడాది మైత్రీవనం నుంచి డీకే రోడ్డు మీదుగా లీలానగర్ వరకు సుమారు రూ.26 లక్షల నిధులతో పూడికతీత పనులు చేపట్టారు. వాటిపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం వాటి పనితీరు ఏ స్థాయిలో ఉందో బయటపడింది. ఫలితంగా ఇక్కడ భారీ పైప్లైన్లు నిర్మించినా ప్రయోజనం లేకపోయింది.