‘మైత్రీవనం’ అంటే హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉండే ఓ ఏరియా అనుకునేరు. ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమా రూపొందింది. లక్ష్మీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుఖేశ్ ఈశ్వరగారి, జెట్టి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవిచరణ్ దర్శకుడు. విశ్వ, వెంకట్, వృషాలీ, హర్షదా పాటిల్, రాజ్ బాలా ప్రధాన పాత్రల్లో నటించారు. పీఆర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మల్కాపురం శివకుమార్, కల్వకుంట్ల కన్నారావుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
చిత్రదర్శకుడు రవిచరణ్ మాట్లాడుతూ – ‘‘యువతలో ఉన్న శక్తి అపారం. అది ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చేయగలదు. ఆ శక్తిని యువత గుర్తించేలా చేసే చిత్రమిది. కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ కథను రాసుకున్నాను. పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తూనే సందేశాత్మకంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఒక చిన్న ఆలోచనతో మొదలైన చిత్రమిది. దర్శకుడు రవిగారు సరదాగా చెప్పిన ఓ పాయింట్ నచ్చి కథని విస్తృతం చేసి, ఈ సినిమా తీశాం. ఇప్పుడున్న చిత్రాల్లో కొత్త ఒరవడిని సృష్టించే చిత్రం అవుతుందని చెప్పగలను’’ అన్నారు సుఖేష్.
వాస్తవ సంఘటనలతో...
Published Wed, Aug 15 2018 1:20 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment