ఆగస్టులో అమీర్‌పేట్‌–ఎంజీబీఎస్‌ మెట్రో | Ameerpet To MGBS Metro Rail Will Start In August 2018 | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 8 2018 11:49 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

Ameerpet To MGBS Metro Rail Will Start In August 2018 - Sakshi

అమీర్‌పేట్‌–ఎంజీబీఎస్‌ మార్గంలో మెట్రో విద్యుదీకరణ పనులను తనిఖీచేస్తున్న అధికారులు  

సాక్షి,సిటీబ్యూరో : అమీర్‌పేట్‌–ఎంజీబీఎస్‌ మార్గంలో మెట్రో రైళ్ల ట్రయల్‌రన్‌కు మార్గం సుగమమైంది. ఈ మార్గంలో మెట్రో ట్రాక్‌ విద్యుదీకరణ ప్రక్రియ, సెక్షన్‌ ఓవర్‌హెడ్‌ ఎలక్ట్రిక్‌ ట్రాక్షన్‌ సిస్టం(ఓఈటీఎస్‌)ను గురువారం కేంద్ర ప్రభుత్వ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్స్‌పెక్టర్‌ డీవీఎస్‌ రాజు తనిఖీచేసి సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ ట్రాక్షన్‌ సిస్టంకు అవసరమైన విద్యుత్‌ ఎంజీబీఎస్, మియాపూర్‌లలో నిర్మించిన  132 కెవి/25 కెవి రిసీవింగ్‌ సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ను అందుకుంటుంది. ఈ ఆర్‌ఎస్‌ఎస్‌కు ఇన్‌కమింగ్‌ సరఫరా టీఎస్‌ ట్రాన్స్‌కోకు చెందిన 220 కెవి/132 కెవి మెయిన్‌ సబ్‌స్టేషన్‌ నుంచి సరఫరా అవుతుందని మెట్రో అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రక్రియ పూర్తికావడంతో ఈ మార్గంలో మెట్రో రైళ్లకు 18 రకాల సాంకేతిక పరీక్షలను నిర్వహించేందుకు మార్గం సుగమమౌతోందని తెలిపారు. 

ఆగస్టులో ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ రూట్లో మెట్రో పరుగులు.. 
ఈ ఏడాది ఆగస్టునెలలో ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నట్లు  తెలిసింది. జూలై నెలలో ఈ మార్గంలో ట్రయల్‌రన్‌ ప్రక్రియను పూర్తిచేసేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ప్రారంభతేదీని మాత్రం ప్రభు త్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీమార్గంలో అక్టోబరులో,ఎంజీబీఎస్‌–జేబీఎస్‌మార్గంలో ఈ ఏడాది డిసెంబరు నాటికి మెట్రో రైళ్లు గ్రేటర్‌ సిటీజన్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మెట్రో అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement