అండర్-19 సింగిల్స్ విజేత వృశాలి | under- 19 badminton singles winner vrushali | Sakshi
Sakshi News home page

అండర్-19 సింగిల్స్ విజేత వృశాలి

Published Mon, Dec 7 2015 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM

under- 19 badminton singles winner vrushali

- సాత్విక్-కృష్ణప్రసాద్‌లకు డబుల్స్ టైటిల్  జాతీయ జూ. బ్యాడ్మింటన్ టోర్నీ
 
జైపూర్:
జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ క్రీడాకారులు వృశాలి మెరిసింది. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన వృశాలి అండర్-19 బాలికల సింగిల్స్‌లో టైటిల్ చేజిక్కించుకుంది. ఫైనల్లో ఆమె 21-15, 18-21, 21-19తో రెండోసీడ్ శ్రేయాన్షి పరదేశి (మధ్యప్రదేశ్)పై గెలుపొందింది. మిక్స్‌డ్ డబుల్స్, బాలుర డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్) టైటిల్స్ గెలిచాడు.

 

బాలుర అండర్-17 డబుల్స్ తుదిపోరులో సాత్విక్ సాయిరాజ్-కృష్ణప్రసాద్ (ఆంధ్రప్రదేశ్) ద్వయం 21-23, 21-19, 21-12తో ధ్రువ్ కపిల-సాయిపవన్ జంటపై విజ యం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్-అహిల్యా హర్జాని (మహారాష్ట్ర) జంట 21-13, 21- 13తో బాలరాజ్ కజియా-మిథుల జోడి (కర్ణాటక)పై నెగ్గింది. హైదరాబాద్ అమ్మాయి తనిష్క్ బాలికల అండర్-17 సింగిల్స్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆమె 13-21, 17-21తో వైదేహి చౌదరి (మహారాష్ర్ట) చేతిలో ఓడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement